వివాహేతర సంబంధం: నగ్నంగా చేసి చితక్కొట్టారు
మరో మతానికి చెందిన మహిళతో సన్నిహితంగా గడిపారనే అక్కసుతో జార్ఖండ్‌లో ఓ వ్యక్తిని దుస్తులు ఊడదీసి నగ్నంగా ఊరేగించారు.
జార్ఖండ్: మరో మతానికి చెందిన మహిళతో సన్నిహితంగా గడిపారనే అక్కసుతో జార్ఖండ్‌లో ఓ వ్యక్తిని దుస్తులు ఊడదీసి నగ్నంగా ఊరేగించారు.
ఓ వ్యక్తి జార్ఖండ్ బోకారో కార్యాలయంలో ప్రగ్యా సెంటర్‌లో పనిచేస్తున్నాడు. అతను మంగళవారం నాడు మరో మతానికి చెందిన మహిళతో సన్నిహితంగా గడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో ఒక్కసారిగా పోగైన జనం అతడిని కార్యాలయం నుండి బయటకు తీసుకొచ్చి దాడి చేశారు.

అంతేకాదు అతడిపై తీవ్రంగా దాడిచేశారు. దీంతో తీవ్ర గాయాలైన అతడిని ఆసుపత్రికి తరలించారు.అయితే అతి కష్టం మీద బాధితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications