ఆర్జేడీ నేతను చితక్కొట్టిన మంత్రి, నెట్లో వీడియో హల్‌చల్

రాంచీ: రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ (ఆర్జేడీ) నేతను ఓ మంత్రి చితక్కొట్టారు. ఈ సంఘటన జార్ఖండ్‌లో జరిగింది. నడి రోడ్డుపైన ఆర్జేడీ నేతను కొట్టడమే కాకుండా, తన బాడీగార్డులతో కూడా కొట్టించాడు. తద్వారా జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి, సీనియర్ బీజేపీ నేత రామచంద్ర చంద్రవంశీ వివాదానికి తెరలేపారు.

ఈ ఘటన పలాము జిల్లాలో జరిగింది. చంద్రవంశీ కులానికి చెందిన కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఓ సభలో ఇది జరిగింది. ఈ కుల సంఘానికి ప్రస్తుతం ఆర్జేడీ నేత అధ్యక్షుడిగా ఉన్నాడు. వేదిక పైన తనను తిట్టారని ఆరోపిస్తూ చంద్రవంశీ అతని పైన పిడిగుద్దులు గుద్దారు.

 Jharkhand minister accused of slapping RJD leader

తన బాడీగార్డులతో కొట్టించారు. ఇదంతా వీడియోలో రికార్డ్ అయింది. ఈ ఘటన పైన ఆర్జేడీ రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది. తన పైన రామచంద్ర దాడి చేశాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరోవైపు, మంత్రి బాడీగార్డు పప్పు కుమార్ యాదవ్ కూడా ఇద్దరు వ్యక్తుల పైన ఫిర్యాదు చేశాడు. కేసును దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా వీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+