విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహతో కన్నుమూత: కోవిడ్ సోకిన రెండేళ్ల తర్వాత విషాదం
రాంఛీ: జార్ఖండ్ రాష్ట్ర విద్యాశఆఖ మంత్రి జగర్నాథ్ మహతో(Jagarnath Mahto) గురువారం కన్నుమూశారు. గత కొద్ది నెలలుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా, మంత్రికి 2020లో కరోనా వైరస్ సోకి కోలుకున్న అనంతరం ఊపిరితిత్తుల మార్పి శస్త్రచికిత్స జరిగింది.
అప్పట్నుంచి మంత్రి తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ట్విట్టర్ వేదికగా ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. జార్ఖండ్ ముక్తి మోర్చా నేత మరణంతో పార్టీకి కోలుకోలేని నష్టం జరిగింది. ఈరోజు రాష్ట్రం ఒక పోరాట వీరుడు, ప్రజల కోసం కష్టపడే నాయకుడ్ని కోల్పోయింది అని వ్యాఖ్యానించారు.

చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంత్రి జగర్నాథ్ మహతో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతిని కలిగించాలి. ఆయన కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను అని సీఎం హేమంత్ సోరెన్ పోస్టు చేశారు. గిరిధ్ డుమ్రీకి ప్రాతినిథ్యం వహించిన మంత్రి మహతో గత నెలలో జరిగిన రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో అస్వస్థతకు గురవ్వడంతో చెన్నైకి తరలించారు.












Click it and Unblock the Notifications