మావోయిస్టులపై పోలీసుల సినిమా: 13న విడుదల
రాంచీ: ఇప్పటివరకు మావోయిస్టుల కథతో పలువురు దర్శకులు సినిమాలు రూపొందించడం చూశాం. కాగా, దేశంలోని మావోయిస్టుల్లో సామాజిక మార్పు తీసుకొచ్చేందుకు జార్ఖండ్ పోలీసులు నూతన ప్రయత్నం చేశారు. మావోయిస్టులపై ఓ సినిమా నిర్మించారు. ఈ సినిమాలో దాదాపు 12మంది అసలైన పోలీసు అధికారులే నటించడం విశేషం.
'ప్రత్యవర్తన్' (ది హోం కమింగ్-ట్యాగ్ అనే ఇచ్చారు) టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. జార్ఖండ్‌కు చెందిన పలువురు ఐపిఎస్ అధికారులతో పాటు మాజీ డీజీపీ రాజీవ్ కుమార్ ఇందులో డిజిపిగా నటించారు.

నిమూ భౌమిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రముఖ గాయకుడు షాన్ పాటలు పాడారు. శ్రీల మజుందార్, మౌసమీ భట్టాచార్య, ఇషాన్, సైకత్ ఛటర్జీ తదితరులు కూడా నటించారు.
రాంచీలోని స్థానిక మల్టీఫ్లెక్స్‌లో ఇటీవలే ఈ చిత్రం ప్రీమియర్ షో ప్రదర్శించారు. నవంబర్ 13న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. పార్టీ సిద్ధాంతం నుంచి మావోలు గాడి తప్పుతున్నారని భావిస్తున్న ఓ మావోయిస్టు జోనల్ కమాండర్ జీవితం చుట్టూ ఈ చిత్రం కథ నడుస్తుంది. ఇందులో మరో విశేషమేంటంటే ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఓ ప్రేమ కథను కూడా పెట్టారు.
ఓ మావోయిస్టు యువకుడు అత్యాచారానికి గురవుతున్న ఓ అమ్మాయిని రక్షించి ఆమెకు దగ్గరవుతాడు. రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడాలనే తన నాయకుల అంచనాలకు, ప్రేమకు మధ్య నలిగిపోయే అంశాన్ని ఈ చిత్రంలో ప్రధానంగా చూపించారు.












Click it and Unblock the Notifications