రేప్ చేసేందుకు యత్నం: వ్యక్తిని చంపేసిన యువతి

రాంచీ: తనను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ధైర్యంగా ఎదుర్కొన్న ఓ యువతి అతడ్ని చంపేసింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని ఛత్ర జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుడి మృతదేహాన్ని కటాహి అటవీ ప్రాంతంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

మృతుడ్ని సుకన్ ఘోషి(65)గా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. ఘటనా స్థలంలో ఓ కత్తిని, కండువాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితుడ్ని చంపిన 15ఏళ్ల యువతిని ప్రశ్నించారు.

లైంగిక వేధింపులకు పాల్పడటంతోపాటు అత్యాచారానికి యత్నించడం వల్లే నిందితుడ్ని యువతి కత్తితో పొడిచి హత్య చేసిందని పోలీసులు తమ విచారణలో తేలినట్లు చెప్పారు. పశువులను మేపేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లిన నిందితుడు, అటువైపు వెళ్తున్న యువతిని ఆపి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

Jharkhand teenager kills man for attempting to rape her

కాలేజీ విద్యార్థిని, మహిళపై అత్యాచారం

జైపూర్: రెండు వేర్వేరు ఘటనల్లో ఓ కళాశాల విద్యార్థిని, ఓ వితంతు మహిళపై అత్యాచారాలు జరిగాయి. ఈ దారుణాలు రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. మొదటి ఘటన వివరాల్లోకి వెళితే.. మనససరోవర్ ప్రాంతంలో ఓ కళాశాలకు చెందిన విద్యార్థిని(24)ని కిడ్నాప్ చేసిన ఓంప్రకాశ్ అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

తుపాకీతో బెదిరించి ఈ దారుణానికి ఒడిగట్టాడు నిందితుడు. బాధితురాలి కుటుంబసభ్యులకు పరిచయమున్న ఓంప్రకాశ్.. అత్యాచార ఘటనకు సంబంధించిన వీడియోను చూపిస్తూ ఆమెను లైంగికంగా వేధించసాగాడు. ఆ వీడియోను చూపించి బాధిత యువతిని పెళ్లిని కూడా చెడగొట్టాడు. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

మరో ఘటనలో 35ఏళ్ల వితంతు మహిళపై కలురాం మీనా అనే పొరుగింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై తరచూ అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+