పెళ్లికి ఒప్పుకోలేదని యువతి గొంతుకోసి, ఆత్మహత్య

రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాను ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో ఓ యువకుడు ఆమె గొంతుకోశాడు. ఆ తర్వాత అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. రాంచీలోని పుందాగ్‌ ప్రాంతానికి చెందిన అమిత్‌(22) అనే ఓ యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి విషయం తేల్చుకోవాలనుకుని నిర్ణయించుకుని ఓ చోటికి రావాలని యువతికి కబురు పంపాడు.

ఆ యువకడు తనను పెళ్లి చేసుకోవాలని కోరగా.. అమ్మాయి అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురై ఆ యువతి గొంతును బ్లేడ్‌తో కోశాడు. అనంతరం అతడే యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించాడు.

Jilted lover cuts girl’s throat for turning down his proposal; commits suicide

వారు ఆస్పత్రికి వచ్చేలోగానే భవనం పైనుంచి కిందికి దూకేశాడు. తీవ్రంగా గాయపడడంతో అమిత్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

గత రెండేళ్ల నుంచి అమిత్‌, తమ కుమార్తె ఇద్దరూ మంచి స్నేహితులని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. అయితే, అమిత్‌ తమ కూతురిని కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడని, ఆమె మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+