దారుణం: మాజీ ప్రియురాలిని కత్తి పొడిచి హత్య చేశాడు

శుక్రవారం ఉదయం ఆ యువతి(17) పబ్లిక్ టాయ్‌లెట్‌కు వెళుతున్న సమయంలో నిందితుడు హసన్ షేక్ (23) ఆమెను వెంబడించాడు. ఆ తర్వాత ఆమెతో గొడవపెట్టుకున్నాడు.
అతని వద్ద ఉన్న కత్తిని తీసి ఆమె గొంతును కోశాడు. అనంతరం విచక్షణా రహితంగా ఆమెను పలుమార్లు కత్తితో పొడిచాడు. దీంతో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆ తర్వాత నిందితుడు హసన్ షేక్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. అయితే స్థానికులు అతడ్ని వెంబడించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. బాధిత యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.












Click it and Unblock the Notifications