Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొన్ని క్షణాల్లో పెళ్ళి: పీటలపై వధువుపై మాజీ ప్రియుడి దాడి, పెళ్ళి రద్దు

చెన్నై: మాజీ ప్రియురాలు వివాహం చేసుకొంటున్న సమయంలో ప్రియుడు పెళ్ళి పీటలపై పెళ్ళి కూతురిపై హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన సంచలనం కల్గించింది. తీవ్రంగా గాయపడిన ఆ యువతి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది.

కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా సాగర తాలుకాలోని భీమనకోణె గ్రామానికి చెందిన ఓ యువతి శివమొగ్గలోని ఓ హెటల్‌లో క్యాషియర్‌గా పనిచేస్తుంది. ఆమెతో నందన్ అనే యువకుడు కొంత కాలంగా ప్రేమాయణం సాగించాడు. కొద్దిరోజుల తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి.

Jilted lover slits girls throat at her wedding venue in Shivamogga

దీంతో ఆ యువతి నందన్‌తో ప్రేమకు స్వస్తి పలికింది. అయితే ఆ యువతికి వేరే యువకుడితో వివాహన్ని కుదిర్చారు. సోమవారం నాడు శివమొగ్గలోని ఓ కళ్యాణ మండపంలో పెళ్ళి జరపాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకొన్న నందన్ ఆ యువతి వివాహం జరిగే వివాహ మండపానికి చేరుకొన్నాడు.

వధువుపై కత్తితో నందన్ విరుచుకుపడ్డారు. ఈ దాడిలో వధువు తీవ్రంగా గాయపడింది. ఈ దాడిలో ఆమె మెడపై తీవ్రంగా గాయమైంది ఈ దాడిని వధువు బంధువులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వధువు బంధువు గంగాధరప్ప అడ్డుకోబోయాడు. అతడిపై కూడ నందన్ దాడికి పాల్పడ్డాడు. అతడికి కూడ తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో నందన్‌ను పెళ్ళి మండపంలో ఉన్న వారు పట్టుకొన్నారు. పోలీసులకు అప్పగించారు. అంతేకాదు నందన్ దాడిలో గాయపడిన వధువు, ఆమెతో పాటు ఆమె బంధువు గంగాధరప్పను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+