ప్రేమించలేదని ఉన్మాదం: కత్తితో చెయ్యి నరికేశాడు..
ఈ ఘటనలో బాలిక ఎడమ చేయి మణికట్టు వరకు పూర్తిగా తెగిపోయి రోడ్డుపై పడింది.
లక్నో: ప్రేమించలేదన్న కారణంతో ఓ యువకుడు ఉన్మాదిగా మారి దారుణానికి తెగబడ్డాడు. ఏకంగా ఆమె చేయినే నరికేసి తన పైశాచికత్వాన్ని బయటపెట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని బాలియాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. వినో చౌరాసియా(19) స్థానిక వెల్డింగ్ షాపులో పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో కొద్ది నెలలుగా ప్రేమ పేరుతో ఓ బాలిక వెంటపడుతున్నాడు. తనకు ఇష్టం లేదని ఆ బాలిక ఎంత చెప్పినా వినిపించుకోలేదు. బుధవారం రోజు ఆమె లఖింపూర్ ఖేరీలో గల మార్కెట్ కు తన సోదరుడితో కలిసి షాపింగ్ చేయడానికి వచ్చింది.

బాలికను మార్కెట్లో చూసిన వినోద్.. ఉన్మాదంతో కత్తి తీసుకుని ఆమె వద్దకు వెళ్లాడు. ఆమె ఎడమ చేయిని నరికేసి తాను కూడా అక్కడే కూలబడ్డాడు. ఈ ఘటనలో బాలిక ఎడమ చేయి మణికట్టు వరకు పూర్తిగా తెగిపోయి రోడ్డుపై పడింది. స్థానికులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ.. రక్తస్రావం ఎక్కువగా కావడంతో పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది.
అత్యవసర చికిత్స కోసం ఆమెను లక్నోలోని ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications