జియో కొత్త ఆఫర్ వచ్చేసింది: రూ.399 రీఛార్జ్ చేసుకుంటే పండగే..!
నూతన సంవత్సరం సందర్భంగా ప్రముఖ టెలికాం దిగ్గజం జియో ఓ సరికొత్త ఆఫర్‌ను కస్టమర్స్‌కోసం ప్రకటించింది. ఈ ఆఫర్ కింద రూ.399తో రీచార్జ్ చేసుకుంటే కూపన్స్ రూపంలో 100శాతం క్యాష్ బ్యాక్ ఇస్తోంది. అయితే ఈ కూపన్స్ ఏజియో ఆన్‌లైన్ ఈ-కామర్స్ పోర్టల్‌లో వినియోగించుకోవచ్చని సంస్థ తెలిపింది.
" ఏజియో ఈ-కామర్స్ పోర్టల్‌తో జియో భాగస్వామి అయ్యింది. జియో కస్టమర్లకు జియో హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ ఇస్తోంది. కూపన్ల రూపంలో 100శాతం క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ఏజియో కూపన్లు వినియోగించి మైజియో యాప్‌లోని మై కూపన్స్ సెక్షన్ ద్వారా ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు "అని ఒక ప్రకటన ద్వారా జియో సంస్థ వెల్లడించింది. ఏజియో యాప్‌లో రూ.1000తో షాపింగ్ చేసిన వారు ఈ కూపన్లను రిడీమ్ చేసుకోవచ్చంటూ పేర్కొంది.

ఇక ఈ ఆఫర్ కొత్త కస్టమర్లకు ఇప్పటికే ఉన్న పాత కస్టమర్లకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే డిసెంబర్ 28,2018 నుంచి జనవరి 31,2019 మధ్య రీచార్జ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుందని స్పష్టం చేసింది. ఈ మధ్యకాలంలో రీఛార్జ్ చేసుకున్న వారికి లభించే కూపన్లు వినియోగించుకునేందుకు చివరి తేదీ మార్చి 15, 2019 అని వివరించింది జియో సంస్థ. 2016 జియో ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి కొత్త సంవత్సరానికి జియో ఆనవాయితీగా ఒక ఆఫర్ ప్రకటించడం విశేషం.












Click it and Unblock the Notifications