Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేటి నుంచే జియో ఫైబర్ సేవలు: కనెక్షన్ తీసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

రిలయన్స్ జియో ఫైబర్ సేవలు నేటి(సెప్టెంబర్ 5) నుంచి అందనున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రర్ చేసుకున్న వినియోగదారులు గురువారం నుంచి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్ హోం సొల్యూషన్ పొందనున్నారు. ఈ మేరకు జియో ఫైబర్ గురించిన ప్రకటనను ఆగస్టు 12న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే.

1జీబీపీఎస్ స్పీడ్

1జీబీపీఎస్ స్పీడ్

ఇప్పటికే బ్రాడ్ బ్యాండ్ సేవలందస్తున్న భారతిఎయిర్‌టెల్, యాక్ట్ ఫైబర్‌నెట్‌కు జియో ఫైబర్‌ సవాలు విసరనుంది. కాగా, టారిఫ్, ప్లాన్స్ అన్నీ ఇవాళ వెల్లడించనున్నారు.

గురువారం (సెప్టెంబర్ 5) జియో ఫైబర్‌ సేవలను ప్రారంభిస్తున్న సందర్భంగా 100 ఎంబీపీఎస్ వేగం నుంచి గరిష్టంగా 1జీబీపీఎస్ వరకు నెట్‌వర్క్‌ను అందించనున్నట్లు తెలిపింది.

జియో ఫైబర్ ప్లాన్స్:

జియో ఫైబర్ ప్లాన్స్:

ప్రీమియం వినియోగదారులకు జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు నెలకు రూ. 700 నుంచి రూ. 10వేల వరకు ఉండనున్నాయి. ప్రస్తుతం జియో ఫైబర్ సేవలను ప్రీపెయిడ్ రూపంలో అందిస్తామని, భవిష్యత్‌లో పోస్ట్ పెయిడ్ సేవలను కూడా అందుబాటులోకి తెస్తామని జియో వివరించింది.

దేశంలోని కీలక నగరాల్లో..

దేశంలోని కీలక నగరాల్లో..

మొదటి దశలో జియో ఫైబర్ కనెక్షన్లు హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, జైపూర్, సూరత్, వడోదర, చెన్నై, నోయిడా, ఘజియాబాద్, భువనేశ్వర్, వారణాసి, అలహాబాద్, బెంగళూరు, ఆగ్రా, మీరట్, లక్నో, జంషెడ్‌పూర్, హరిద్వార్, గయ, పాట్నా, పొర్ట్ బ్లెయిర్, పంజాబ్‌లలో అందుబాటులో ఉన్నాయి. మిగితా నగరాల్లోనూ త్వరలోనే జియో ఫైబర్ సేవలు అందనున్నాయి.

రూ. 2,500 డిపాజిట్..

రూ. 2,500 డిపాజిట్..

జియో ఫైబర్ ఇన్‌స్టాలేషన్, కనెక్షన్‌కు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. ఫిక్స్‌డ్ ఫోన్ సర్వీస్, గేమింగ్ కేబుల్ సెట్-టాప్-బాక్స్, ఉచిత 4కే టీవీ, జియో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ) సర్వీసులు అందించనుంది. అయితే, రూటర్ కోసం మాత్రం రూ. 2,500 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, ఆ మొత్తాన్ని రిఫండ్ చేస్తామని కూడా పేర్కొంది.

రిజిస్ట్రేషన్ ఇలా..

రిజిస్ట్రేషన్ ఇలా..

జియో ఫైబర్ సేవలను పొందేందుకు జియో వెబ్ సైట్‌, https://gigafiber.jio.com/registrationలో అడ్రస్ తెలిపి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అడ్రస్ తోపాటు మీకు సంబంధించిన పలు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఓటీపీతో వెరిఫికేషన్ పూర్తవుతుంది. కాగా, గత సంవత్సరం నుంచే జియో ఫైబర్ కోసం రిజిస్ట్రేషన్ ను ప్రారంభించింది జియో. ఇప్పటి వరకు 15 మిలియన్లకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. దేశంలో 1600 పట్టణాల్లో జియో సేవలు అందుబాటులోకి తీసుకొస్తోంది. పూర్తి వివరాలు వారంలోగా తెలిపే అవకాశం ఉంది.

జియో ఫైబర్ సెట్ టాప్ బాక్స్.. రిలీజ్ సినిమాలు

జియో ఫైబర్ సెట్ టాప్ బాక్స్.. రిలీజ్ సినిమాలు

లోకల్, ఎస్టీడీ సేవలతోపాటు ఓటీటీ కంటెంట్ కూడా ఉచితంగా అందిస్తోంది. ఓటీటీలో ఏం వస్తాయనేది ఇంకా స్పష్టత లేదు. కానీ, జియో సినిమా, జియోటీవీ, జియో సావన్ లాంటి సేవలు అందుబాటులో ఉండనున్నాయి. అంతేగాక, జియో ప్రీమియం జియోఫైబర్ కస్టమర్లకు ‘ఫస్ట్ డే ఫస్ట్ షో' సేవలను కూడా అందిస్తోంది. దీని ప్రకారం కొత్త సినిమాను విడుదలైన రోజే వినియోగదారులు తమ ఇంట్లోనే వీక్షించవచ్చు. వెల్ కమ్ ఆఫర్ కింద్ 4కే ఎల్ఈడీ టీవీ, 4కే ఎస్టీబీని కంపెనీ ఉచితంగా అందించనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+