వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లా విద్యార్థిని రేప్, హత్య: అతన్ని దోషిగా నిర్దారించిన కోర్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

కొచ్చి: కేరళలో సంచలనం సృష్టించిన లా విద్యార్థిని జిషా రేప్, హత్య కేసులో అమీరుల్ ఇస్లాంను ఎర్నాకుల ప్రిన్సిపల్ కోర్టు దోషిగా నిర్ధారించింది. మంగళవారం కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. దోషిగా బుధవారం శిక్ష ఖరారు చేయనుంది.

లా విద్యార్థిపై రేప్, హత్య: అతన్నెలా పట్టుకున్నారు? లా విద్యార్థిపై రేప్, హత్య: అతన్నెలా పట్టుకున్నారు?

అమీరుల్ ఇస్లాం అస్సాం నుంచి వలస వచ్చిన కూలీ. నిరుడు కేరళలో 30 ఏళ్ల దళిత లా విద్యార్థినిపై అత్యాచారం జరగడమే కాకుండా ఆమె కిరాతకంగా హత్యకు గురైంది. ఈ కేసులో అమీరుల్ ఇస్లాం ఒక్కడే నిందితుడు.

Jisha rape, murder case: Ameerul Islam convicted, sentencing tomorrow

దళిత విద్యార్థిని శవం 2016 ఏప్రిల్‌లో రక్తం మడుగులో పడి ఉంది. ఆ స్థితిలో జిషాను ఆమె తల్లి చూసింది. ఈ సంఘటన పెరంబవూరులోని వట్టోలిపాడిలో జరిగింది. హత్య గురించి ఇరుగుపొరుగువారికి ఏ విధమైన ఆనవాళ్లు కూడా దొరకలేదు. అరుపులు కూడా వారికి వినిపించలేదు.

అమీరుల్ ఇస్లాం అత్యాచారం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో పదునైన ఆయుధంతో చంపేశాడు. ఆమె శవం కనిపించిన 50 రోజుల తర్వాత పోలీసులకు అమీరుల్ ఇస్లాం పట్టుబడ్డాడు.

కేసు విచారణ ఏప్రిల్ 4వ తేదీన ప్రారంభమై 85 రోజుల పాటు సాగింది. ప్రాసిక్యూషన్ వంద మంది సాక్షులను విచారించింది. ఐదు వేల మంది వేలిముద్రలను పరీక్షించారు.

English summary
The Ernakulam Principal Sessions Court on Tuesday found migrant labourer from Assam Ameerul Islam guilty of rape and murder of Jisha, a 30-year-old Dalit law student in Kerala last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X