అసెంబ్లీని రద్దు చేస్తారా: మాంఝీని నితీష్ టచ్ చేస్తే.. దేనికైనా రెడీ?

పాట్నా: బీహార్ రాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. మాజీ ముఖ్యమంత్రి, జేడీయు సీనియర్ నేత నితీష్ కుమార్ తిరిగి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. దానిని అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ చూస్తున్నారు.

ఇందులో భాగంగా మాంఝీ దేనికైనా సిద్ధంగా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. జేడీయు అధ్యక్షులు శరద్ యాదవ్ శనివారం నాడు పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. నితీష్ కుమార్‌ను సీఎంగా చేసే అంశంపై చర్చించనున్నారని తెలుస్తోంది. ఆ భేటీకి మాంఝీ వర్గం ఎమ్మెల్యేలు గైర్హాజరు కానున్నారు.

అంతేకాదు, పలువురు ఎమ్మెల్యేలు భేటీకి వెళ్లకుండా మాంఝీ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఒకవేళ నితీష్ కుమార్‌కు సీఎం పగ్గాలు అప్పగించాల్సిన పరిస్థితి వస్తే మాంఝీ ఏకంగా ప్రభుత్వాన్ని కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Jitan Ram Manjhi may dissolve Bihar assembly if he is forced to give up CM’s chair

నితీష్ కుమార్ గత నెల రోజులుగా తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. అందుకోసం ఆయన మొన్నటి వరకు తమ ప్రత్యర్థిగా ఉండి, ఇప్పుడు దోస్తీకి వచ్చిన ఆర్జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ మద్దతు కూడా కోరారు. అందుకు ఆయన కూడా అంగీకరించినట్లుగా చెబుతున్నారు.

తనను ముఖ్యమంత్రి పీఠం నుండి తొలగించేందుకు శరద్ యాదవ్ మీటింగ్ ఉపయోగపడితే.. ఆ పరిస్థితి వస్తే.. అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలు కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు. మాంఝీ మద్దతుదారు అయిన ఓ నాయకుడు మాట్లాడుతూ.. మాంఝీని ఎవరైనా టచ్ చేయాలని చూస్తే, వారి చేతులో కాలిపోతాయని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+