భారత్ లోని స్లీపర్ సెల్స్, గూఢచారులను యాక్టివేట్ చేసిన పాకిస్థాన్: ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా

పాకిస్థాన్- భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ ఘటనలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా క్షీణించాయి. జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలిన నేపథ్యంలో.. మే 7 నుంచి మే 10 వరకు పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది. ఆపరేషన్ సింధూర్ లో భారత్ దిగ్విజయం సాధించింది.

అయితే అప్పటి పరిస్థితులను ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా మరోసారి వివరించే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ సింధూర్ లో రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన ఎస్-400 డిఫెన్స్ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఈ ఎస్-400 కారణంగానే పాకిస్థాన్ జెట్స్ భారత సరిహద్దుకు 200 కిలోమీటర్ల వద్దే ఆగిపోయాయని తెలిపారు. ఈ ఎస్-400 వ్యవస్థలను భారత్ ఎక్కడ మోహరించిందో అర్థం కాక పాకిస్థాన్ ప్రభుత్వం.. స్లీపర్ సెల్స్, గూఢచారులను యాక్టివేట్ చేసిందని వివరించారు. అలాగే చైనా సహా ఇతర దేశాలకు చెందిన శాటిలైట్స్ ద్వారా కూడా సమాచారం పొందే ప్రయత్నం చేశారని జితేంద్ర మిశ్రా స్పష్టం చేశారు. ఇక ఇదే విషయాన్ని గతంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ల్యూటెనెంట్ జనరల్ రాహుల్ ఆర్. సింగ్ తెలిపారు. భారత్ కు సంబంధించిన అన్ని వివరాలను శాటిలైట్స్ ద్వారా చైనా.. పాకిస్థాన్ కు చేరవేసిందని అన్నారు.

JitendraMishra Pak activated sleeper cells spies locate the S400 defense system Operation Sindhur

" పాకిస్థాన్ వైమానిక దాడులకు పూనుకున్న ప్రతిసారి ఎస్-400 ఆయుధ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేసి వాటిని కూల్చేశాయి. ఎస్-400 వారికి అతిపెద్ద ముప్పుగా మారింది. ఎస్-400 ఆయుధ వ్యవస్థల్ని కనుగొనేందుకు భారత్ లోని స్లీపర్ సెల్స్, గూఢచారులను కూడా పాకిస్థాన్ యాక్టివేట్ చేసింది" అని ఎయిర్ చీఫ్ మార్షల్ జితేంద్ర మిశ్రా తెలిపారు. ఇక ఎస్-400 ఆయుధ వ్యవస్థను సుదర్శన చక్ర అని పిలుస్తుంటారు. ఇది అత్యాధునికమైన ఆయుధ వ్యవస్థ. సర్ ఫేస్ టూ ఎయిర్ మిసైల్ సిస్టమ్ గా దీనిని రష్యా అభివృద్ధి చేసింది. ఆధునిక వైమానిక దాడులను ఇది సమర్థవంతంగా తిప్పికొడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+