Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Republic-Gulistan Exit Polls: జమ్మూ కాశ్మీర్‌లో హోరాహోరీ: ఆ రెండు పార్టీల మధ్య నంబర్ గేమ్

Jammu Kashmir assembly Election 2024 exit polls: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్, హర్యానాల్లో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడుతున్నాయి. 90 సీట్లు ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో మూడు దశల్లో పోలింగ్ ముగిసింది. కిందటి నెల 18, 25, ఈ నెల 1న తమ ఓటు హక్కును వినియోగించుకున్నారక్కడి ఓటర్లు.

హర్యానాలో కూడా 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ సాయంత్రం 6 గంటలకు ఒకే విడతలో పోలింగ్ ముగిసింది. 6:30 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ అంచనా పోటెత్తాయి. ఆర్టికల్ 370 రద్దు, దశాబ్దకాలం తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరగడం వల్ల అందరి దృష్టి కూడా జమ్మూ కాశ్మీర్ మీదే నిలిచింది.

JK assembly Election 2024 exit polls Republic-Gulistan predicted BJP and NC to secure 28 to 30 each

ఇక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేశాయి. దైనిక్ భాస్కర్ సంస్థ ఇదే విషయాన్ని వెల్లడించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 45. ఈ సంఖ్య ఏ పార్టీకి కూడా అందబోదని అభిప్రాయపడింది. నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ అలయెన్స్‌గా ఆవిర్భవిస్తుందని పేర్కొంది.

ఈ కూటమికి 35 నుంచి 40 వరకు స్థానాలు లభించే అవకాశం ఉందని దైనిక్ భాస్కర్ వివరించింది. భారతీయ జనతా పార్టీ 20 నుంచి 25 నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం కావొచ్చు. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సారథ్యాన్ని వహిస్తోన్న పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ సైతం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవచ్చు. పీడీపీ 4 నుంచి 7 స్థానాలే దక్కే అవకాశం ఉంది. ఇతరులు 12 నుంచి 16 స్థానాలను గెలుచుకుంటారని దైనిక్ భాస్కర్ పేర్కొంది.

రిపబ్లిక్- గులిస్తాన్ ఎగ్జిట్ పోల్స్ ఇంచుమించుగా ఇదే విషయాన్ని అంచనా వేశాయి. భారతీయ జనతా పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్‌కు సరి సమానంగా సీట్లు వస్తాయని తెలిపింది. ఈ రెండు పార్టీలకూ 28 నుంచి 30 సీట్లు వస్తాయని తెలిపింది. పీడీపీకి కనీసం రెండంకెలు కూడా దక్కకపోవచ్చు. 5 నుంచి 7 స్థానాలకే పరిమితం అవ్వొచ్చు.

నేషనల్ కాన్ఫరెన్స్‌తో కలిసి ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్‌కు మూడు నుంచి ఆరు సీట్లు లభిస్తాయి. ఇతరులు 8- 16 స్థానాలను జయకేతనం ఎగురవేసే అవకాశం ఉందని రిపబ్లిక్- గులిస్తాన్ పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ హంగ్ అసెంబ్లీ దాదాపుగా ఖాయమైనట్టే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+