రాజెవరో తేలేది అప్పుడే
Jammu Kashmir Assembly election 2024: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ఆరంభమైంది. ఇదే చివరి దశ. ఈ ఉదయం సరిగ్గా 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. గడువు దాటిన తరువాత కూడా క్యూలైన్‌లో వేచివున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు ఎన్నికల సిబ్బంది.
దశాబ్ద కాలం తరువాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తం మూడు విడతల్లో పోలింగ్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు షెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 18, 25వ తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఇప్పుడు చివరిది. ఈ నెల 8వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.

దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే పూర్తి చేసింది. పోలింగ్ సజావుగా సాగడానికి ఈసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరింపజేసింది. అలాంటి ప్రాంతాల్లో వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ జరుగుతోంది.
ఇక్కడ ఉన్న మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య.. 90. నేడు.. ఉధంపూర్ వెస్ట్, ఉధంపూర్ ఈస్ట్, ఛెన్ని, రామ్ నగర్, బణి, బిల్లావర్, బసోహ్లి, జస్రోటా, కథువా, హీరానగర్, రామ్‌గఢ్, సాంబ, విజయ్‌పూర్, బిష్నా, సుచేత్‌గఢ్, ఆర్ ఎస్ పురా, జమ్మూ సౌత్, బహు, జమ్మూ ఈస్ట్, నగ్రోటా, జమ్మూ వెస్ట్, జమ్మూ నార్త్, అఖ్నూర్, ఛాంబ్‌లల్లో పోలింగ్ సజావుగా సాగుతోంది.
అలాగే- కర్నా, త్రేఘాం, కుప్వారా, లోలాబ్, హంద్వారా, లంగేట్, సోపోర్, రఫియాబాద్, యూరి, బారాముల్లా, గుల్మార్గ్, వాగూరా-క్రీరీ, పట్టన్, సోనావరి, బండీపోరా గురేజ్ నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు.
కాగా- ఉదయం 9 గంటల వరకు 11.60 శాతం మేర పోలింగ్ నమోదైంది. ఉధంపూర్‌లో అత్యధికంగా 14.23, అత్యల్పంగా బారాముల్లాలో 8.89 శాతం మేర పోలింగ్ రికార్డయింది. బండీపొరా- 11.64, జమ్మూ- 11.46, కథువా- 13.09, కుప్వారా- 11.27, సాంబ- 13.31 శాతం పోలింగ్ జరిగినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications