చదివిస్తానని చెప్పి, 2 నెలలుగా మరదలిపై అత్యాచారం

అతను కొద్ది రోజుల క్రితం బాధితురాలి సోదరిని పెళ్లి చేసుకున్నాడు. బాధిత బాలిక ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఆమె మునిర్కా ప్రాంతంలోని బావ ఇంట్లో ఉంటూనే చదువుకుంటోంది. బాధితురాలి సోదరి ఉత్తర ప్రదేశ్‌లోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. బాధితురాలు ఇక్కడే ఉంది.
ఇటీవల ఆమెకు కడుపులో నొప్పి వచ్చింది. ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అప్పుడు అతని బాగోతం బయటపడింది. ఆమె రెండు నెలల గర్భవతిగా వైద్యులు గుర్తించారు. విషయం తెలుసుకున్న వైద్యులు, దానిని పోలీసులకు చెప్పారు.
ఉత్తర ప్రదేశ్‌లో ఉండే బాధితురాలి తల్లిదండ్రులు చదువు నిమిత్తం ఆమెను ఢిల్లీలో ఉంటే అక్కా, బావ వద్దకు పంపించారు. తన మరదలిని బాగా చదివిస్తానని నిందితుడు ఆ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చాకనే వారు పంపించారు.
అయితే, ఆమెను అత్యాచారం చేసిన నిందితుడు, కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా మాట్లాడమని బెదిరించినట్లుగా చెబుతున్నారు. నిందితుడి పైన అత్యాచార యాక్ట్ కింద కేసు పెట్టినట్లు పోలీసులు చెప్పారు. బాధిత బాలిక వాంగ్మూలం తీసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.












Click it and Unblock the Notifications