గ్రేట్ ఎస్కేప్ : జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్‌పై హత్యాయత్నం
ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థినేత ఉమర్ ఖలీద్‌పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. అయితే కాల్పుల నుంచి ఖలీద్ తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన కాన్స్‌టిట్యూషన్ క్లబ్ బయట చోటుచేసుకుంది. 'కాఫ్ సే ఆజాదీ' అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉమర్ ఖలీద్ కాన్స్‌టిట్యూషన్ క్లబ్‌కు వచ్చాడు. ఈ కార్యక్రమాన్ని యునైటెడ్ అగినెయిస్ట్ హేట్ అనే సంస్థ నిర్వహించింది.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... ఖాలిద్ తన ఇతర మిత్రులతో కలిసి ఓ చెట్టుకింద ఉన్న టీస్టాల్ దగ్గర టీ తాగుతున్న సమయంలో ఓ దుండగుడు ఖలీద్‌ను కిందకు తోసేసి తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపాడని చెప్పారు. కాల్పులు జరిపినప్పుడు ఖలిద్ కిందకు పడిపోవడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత గాల్లోకి కాల్పులు జరిపి అక్కడి నుంచి ఆ దుండగుడు పారిపోయాడు. ఈ ఘటన తర్వాత ఖాలిద్ మాట్లాడాడు. దేశంలో భయానకవాతావరణం కనిపిస్తోందని... ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇలా బెదిరింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.

ఫిబ్రవరి 9, 2016న జవహర్‌లాల్ యూనివర్శిటీలో జాతివ్యతిరేక నినాదాలు చేశారని పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వారిలో ఖలీద్ కూడా ఒకరిగా ఉన్నాడు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్శిటీల్లోని విద్యార్థులు రోడ్లపైకొచ్చి తమ నిరసనలు తెలిపారు. ఇదిలా ఉంటే జాతివ్యతిరేక నినాదాలు చేశాడని పలు సెక్షన్ల కింద ఖలీద్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. యూనివర్శిటీ కూడా అతన్ని సస్పెండ్ చేసింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications