జేఎన్‌యూలో ఉద్రిక్తత... పోలీసులతో విద్యార్థుల బాహాబాహీ!

న్యూఢిల్లీ: లైంగిక వేధిపుల ఆరోపణలపై జేఎన్‌యూ ప్రొఫెసర్ అరెస్టుకు విద్యార్థులు చేస్తున్న డిమాండ్ సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

జేఎన్‌యూ ప్రొఫెసర్‌ అతుల్ జోహ్రిని తక్షణం అరెస్టు చేయాలంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ఢిల్లీ వసంత్‌కుంజ్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

jnu-students-protest

ప్రొఫెసర్ అతుల్ జోహ్రిపై నలుగురు విద్యార్థినులు ఫిర్యాదు చేసినప్పటికీ ఒక ఫిర్యాదుపై మాత్రమే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాగా, సీఆర్‌పీసీ 164 సెక్షన్ కింద నలుగురు బాధిత విద్యార్థినుల నుంచి స్టేట్‌మెంట్లు తీసుకున్నామని, ఇంతవరకూ ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశామని డీసీపీ తెలిపారు.

అవసరమైతే మరిన్ని సెక్షన్లు కూడా చేరుస్తామన్నారు. కాగా, అతుల్ జోహ్రికి నోటీసు జారీ చేశామని, రేపు విచారణకు ఆయన హాజరవుతారని అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+