viral:జాబ్ మజా రావడం లేదట.. ఒక్క పదంలో రిజైన్, షేర్ చేసిన సార్.. వైరల్
ఏదైనా కంపెనీలో పనిచేస్తూ రాజీనామా చేయడం అంటే బాధే.. ఎందుకంటే అన్నీ రోజులు కోలిగ్స్‌తో కలిసి.. మంచి చెడు షేర్ చేసుకుంటున్నారు. వర్క్ చేస్తూనే కష్ట సుఖాలను పంచుకుంటారు. అలా కంపెనీతో వారికి అనుబంధం ఉంటుంది. మంచి ఆఫర్ వచ్చినా సరే.. కొందరు అయితే సంస్థలను వీడేందుకు ఇబ్బంది పడతారు. కొత్త ప్లేస్‌లో ఎలా ఉంటుందనే సందేహాం వారిని వెంటాడుతుంది.
చివరికీ కంపెనీని వీడే సమయంలో రాసే రిజైన్ లెటర్ కోసం.. అపసోపాలు పడతారు. కానీ ఇప్పుడు కొందరు రాజీనామా చేస్తున్నా అని సింపుల్‌గా చెబుతున్నారు. ఒక్కటంటే ఒక్క ముక్కలో చెప్పేస్తున్నారు. ఇదివరకు ఒక కంపెనీ తమకు అదీ నేర్పించంది.. ఇక్కడ ఇదీ నేర్చుకున్నామని అనేవారు.

నో రీజన్స్
ఉద్యోగానికి రాజీనామా చేసే ముందు దానికి కారణాలను రాసి రాజీనామా లేఖను బాస్ ముందు పెడతారు. ఇదీ కామన్ ఫార్మాట్.. అయితే ఒకరు మాత్రం సూటిగా తన సమస్యను రెండు ముక్కల్లో చెప్పేసి ఉద్యోగానికి రిజైన్ చేసేశాడు. ప్రముఖ కంపెనీ ఆర్పీజీ ఎంటర్‌ప్రైజెస్‌లో సదరు ఉద్యోగి రాసిని రిజిగ్నేషనల్ లెటర్‌ను ఫొటో తీసిన ఆ కంపెనీ చైర్మన్ హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అదీ వైరల్ అవుతుంది.

మజా రావడం లేదట..
డియర్ హర్ష్, నేను రాజీనామా చేస్తున్నా. జాబ్ మజా రావడం లేదు అని మాత్రమే ఉంది. దానిని షేర్ చేసిన గోయెంకా.. లెటర్ చిన్నగా ఉన్నా లోతుగా ఆలోచింపచేస్తుంది. ఇదీ చాలా పెద్ద సమస్య. మనందరం కలిసి సాల్వ్ చేయాలని పోస్ట్ చేశాడు. దీనిపై కొందరు నెటిజన్లు నిజమని కామెంట్లు చేస్తున్నారు. చాలా పెద్ద సమస్యేనని వాళ్లు అంటున్నారు. అవును జాబ్ మజా రావడం లేదని అతను అనడం చూస్తే.. అతనికి ఫీల్డ్ సరిపోలేదా.. లేదంటే మరొ అంశం కారణమా అనేది తెలియాల్సి ఉంది.

బైబై సార్
ఇంతకుముందు కూడా ఇలాంటి రిజైన్ వైరల్ అయ్యింది. డియర్ సార్.. రిజైన్ లెటర్, బై బై సార్ అని రాశారు. కంపెనీలో చేరాను.. కొత్త విషయాలు తెలుసుకున్నానని అని చెప్పలేదు. కొన్ని విషయాలు తెలిసి వచ్చాయని కూడా చెప్పలేదు. ఒక్క కామెంట్‌లో రాజీనామా చేస్తున్నా అని కామెంట్ చేశారు. తొలుత ఇదీ వైరల్ అయ్యింది. తర్వాత మరో లేఖ కూడా ట్రోల్ అవుతుంది.












Click it and Unblock the Notifications