కెర్రీ: ఓ చోట బ్రేక్‌ఫాస్ట్, ఇంకో చోట లంచ్, మరో చోట నిద్ర
అహ్మదాబాద్: అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, యూఎన్ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్‌ల గుజరాత్ పర్యటనలో అసాధారణ భద్రతా చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. దీనిలో భాగంగా కెర్రీ, మూన్‌ల బస అహ్మదాబాద్ నగరంలో మూడు హోటళ్లలో ఏర్పాట్లు చేసినట్టు వారు తెలిపారు.
జాన్ కెర్రీ రాక గురించి హోటల్ వారికి కూడా చివరి నిమిషం దాకా ఎలాంటి సమాచారం ఇవ్వబోమని చెప్పారు. జాన్ కెర్రీ ఉదయం టిఫిన్ ఒక హోటల్లో, మధ్యాహ్న భోజనం మరో చోట, రాత్రి బస చేసేందుకు మరో హోటల్ బుక్ చేసినట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి వివరించారు.

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ విషయంలో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్టు చెప్పారు. జాన్ కెర్రీ కోసం గుజరాత్ పోలీసులు, అమెరికా భద్రతా సంస్థల అధికారులు ఐక్యంగా నగరంలోని మూడు హోటళ్లలో గదులు బుక్ చేసే వ్యాహాన్ని అనుసరించారు.
కెర్రీ ఓ హోటళ్లో బ్రేక్ ఫాస్ట్ చేస్తాడు, ఏ హోటల్లో మధ్యాహ్న భోజనం చేస్తాడు, ఏ హోటల్లో నిద్రిస్తాడనే విషయం కేవలం ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి మాత్రమే తెలుస్తుంది. వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ కోసం సుమారు 20 బుల్లెట్ ప్రూఫ్ కార్లు సిద్ధం చేశారు. జాన్ కెర్రీ, బాన్ కీ మూనన్ తదితరుల కోసం ఆ కార్లు సిద్ధం చేశారు.












Click it and Unblock the Notifications