Johnson & Johnson’s: ఇండియాలో జాన్సన్ టాల్కమ్ పౌడర్ అమ్మకాలు.. ఆందోళనలో తల్లిదండ్రులు.. ఈ విషయాలు తెలుసుకోండి
Johnson and Johnson's: క్యాన్సర్ ఆరోపణల నేపథ్యంలో జాన్సన్ అండ్ జాన్సన్స్ తన టాల్క్ ఆధారిత జాన్సన్ బేబీ పౌడర్ నిలిపివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 2023లో దీనిని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అమెరికా, కెనడా వంటి మార్కెట్లకు సరఫరా రెండేళ్ల కిందట ఆపేసిన విషయం తెలిసిందే. అయితే భారత మార్కెట్లో మాత్రం దీని అమ్మకాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. దీనికి మాత్రం కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ పోర్ట్‌ఫోలియోకు మారుతున్నట్లు వెల్లడించింది.

ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు..
దేశంలో ఉత్పత్తి నిరంతర లభ్యతను బాలల హక్కుల సంఘాలు, తల్లిదండ్రులు, వైద్యులు ప్రశ్నిస్తున్నారు. భారతీయ ఔషధ నియంత్రణ సంస్థలు ఈ సమస్యపై మౌనంగా ఉండటాన్ని వారు తప్పుపడుతున్నారు. మరోపక్కన.. "భారత్ లో ఈ టాల్క్‌ను ఉపసంహరించుకునే ప్రణాళిక లేదుని, రీకాల్ చేయబోమని" కంపెనీ తెలిపింది. పౌడర్ సురక్షితమైనదని, ఉత్పత్తిని నిలిపివేసేవరకు అమ్మకాలు కొనసాగుతాయని తెలిపింది.

ఉత్పత్తి వల్ల అండాశయ క్యాన్సర్..
ఆస్బెస్టాస్ అండాశయ క్యాన్సర్‌కు కారణమైందని మహిళలు వ్యాజ్యాలు వేసిన తరుణంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. టాల్క్ ఆధారిత జాన్సన్ బేబీ పౌడర్ సురక్షితమైనదని.. ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణుల దశాబ్దాల స్వతంత్ర శాస్త్రీయ విశ్లేషణలను తాము నమ్ముతున్నట్లు కంపెనీ వెల్లడించింది.

యశోద హాస్పిటల్స్ హైదరాబాద్..
కంపెనీ ప్రపంచంలోని పశ్చిమ ప్రాంతంలో అనుసరించిన వ్యూహాన్ని మనదేశంలో అమలు చేయటంలో ఆలస్యం చేసిందని డాక్టర్ సురేష్ కుమార్ పానుగంటి అన్నారు. ఈయన లీడ్ కన్సల్టెంట్-పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ లో వైద్యులుగా పనిచేస్తున్నారు. తయారీ కోసం ఉత్పత్తిని నిలిపివేస్తే, దానిని ఎందుకు విక్రయించాలి, రీకాల్ చేయకూడదని ప్రశ్నించారు.

శ్వాసకోశ వ్యాధులు..
పిల్లల శరీరంపై టాల్కమ్ పౌడర్‌ను ఉపయోగించవద్దని దశాబ్దాలుగా వైద్యులు తల్లిదండ్రులకు సలహా ఇస్తున్నారు. ఆస్బెస్టాస్ లేనప్పటికీ.. టాల్క్‌ను పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆస్బెస్టాస్ అనేది ప్రాథమికంగా 1980లలో భారతదేశంలో సాధారణంగా ఉపయోగించే ఒక నిర్మాణ సామగ్రి, తరచుగా ఫైర్‌ఫ్రూఫింగ్, ఇన్సులేషన్‌లో దీనిని వినియోగించేవారు. ఆస్బెస్టాస్ దీర్ఘకాలం శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు మరియు పెద్దప్రేగు క్యాన్సర్‌తో సహా బహుళ క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉంది.

పెండింగ్ లో నిర్ణయం..
నేషనల్ కమీషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫర్ చైల్డ్ రైట్స్ డ్రగ్ రెగ్యులేటర్ తీరుపై ప్రశ్నిస్తున్నారు. J&J బేబీ షాంపూ, టాల్కమ్ పౌడర్‌లో..ఫార్మాల్డిహైడ్, ఆస్బెస్టాస్ గుర్తించే పరీక్షా పద్ధతుల్లో ఏకరూపత లేకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ విషయంపై తుది నిర్ణయం పెండింగ్‌లో ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications