Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Josh 1st Anniversary:ఏక్ నెంబర్ ఛాలెంజ్ విజేతల జాబితా ఇదే..మీరున్నారా..?

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఇక ఈ జనరేషన్ కూడా తమ టాలెంట్‌ను సోషల్ మీడియా వేదికగానే ప్రదర్శిస్తున్నారు. దీంతో వారికున్న టాలెంట్‌ను ఒక్క వీడియో చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగానే ఓవర్‌నైట్‌లో స్టార్‌గా మారుతున్నారు. ఆ పై సెలిబ్రిటీగా కూడా వెలిగిపోతున్నారు. ఈ క్రమంలోనే భారత్ అతిపెద్ద షార్ట్ వీడియో మేకర్ యాప్ జోష్ లాంచ్ అయిన అతిస్వల్ప కాలంలోనే పెద్ద హిట్ అయ్యింది. కంటెంట్ కమ్యూనిటీలో టాలెంట్‌ను ప్రదర్శించేందుకు చక్కటి అవకాశం కల్పిస్తోంది జోష్ యాప్. కంటెంట్ క్రియేటర్లను తమ సృజనాత్మకతను ప్రదర్శించేందుకు ప్రోత్సహిస్తోంది. అంతేకాదు కరోనా సమయంలో బ్లూ వారియర్స్ క్యాంపెయిన్‌ పేరిట పలువురి సెలబ్రిటీలతో జట్టు కట్టి ఆ సమయంలో చాలామందిని ఆదుకునేందుకు జోష్ ముందుకొచ్చింది. అందుకే జోష్ యాప్ నెంబర్ వన్ యాప్‌గా వెలుగొందుతోంది.

ఇక తమ టాలెంట్ ప్రదర్శించేందకు యూజర్లకు మంచి వేదికగా మారిన జోష్ యాప్... దేశం కష్ట సమయంలో ఉన్న సందర్భాల్లో బ్లూ వారియర్ క్యాంపెయిన్ నిర్వహించి తమ వంతు సహాయం అందజేసింది జోష్ యాప్ యాజమాన్యం. ఆ సమయంలో యాప్ పలు ప్రముఖ బ్రాండ్లతో జతకట్టడమే కాకుండా.. సెలబ్రిటీలతో ఓ మంచి కంటెంట్‌ను కూడా తయారు చేసింది. డ్యాన్స్, మ్యూజిక్, ఫ్యాషన్, కామెడీ ఇలా పలు విభాగాల్లో వివిధ భాషల్లో కంటెంట్ క్రియేట్ చేసేందుకు జోష్ యాప్ అవకాశం కల్పిస్తోంది.

Josh 1st Anniversary:Winners of Ek number Challenge announced

అంతేకాదు భారత్‌లోని జోష్ టాప్ ఇన్‌ప్లుయెన్లర్లు ఆగష్టు 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జోష్ ఇన్స్‌టాగ్రామ్ హ్యాండిల్‌పై లైవ్‌లోకి వచ్చారు. వీరంతా జోష్ ఏక్ నెంబర్ ఛాలెంజ్‌లో పాల్గొని ఆయా విభాగాల్లో సవాల్ విసిరారు.

ఫైసల్ షేక్ విసిరిన ఛాలెంజ్‌ను ఇక్కడ చూడగలరు

దీపక్ తుల్స్యాన్ విసిరిన ఛాలెంజ్

క్రిష్ గవాలీ విసిరిన ఛాలెంజ్ ఇక్కడ చూడగలరు

ఆగష్టు 2021తో జోష్ యాప్ ఏడాది పూర్తి చేసుకుంది. ఈ తొలి వార్షికోత్సవంను సెలబ్రేట్ చేసుకునేందుకు జోష్ యాప్ ఏక్ నెంబర్ అనే ప్రత్యేకమైన ఛాలెంజ్‌ను ప్రకటించింది. ఆగష్టు 20వ తేదీన ఇది ప్రారంభమైంది. ఎంతో జోష్‌తో ఫన్‌తో కూడుకున్న ఈ కాంటెస్ట్‌కు మరింత అందం తీసుకురావాలనే ఉద్దేశంతో నటుడు సోనూసూద్, నటి మౌనిరాయ్‌లను కూడా ఇందులో భాగస్వామ్యం చేసింది జోష్ యాప్. వీరిద్దరూ ఏక్ నెంబర్ చాలెంజ్‌ను ఐదు జర్నర్స్‌లో నిర్వహించారు. అవి డాన్స్, ఫుడ్, ఫ్యాషన్, కామెడీ, మరియు ఫిట్‌నెస్ విభాగాల్లో ఈ ఛాలెంజ్ నిర్వహించారు మొత్తం 8 భారతీయ భాషల్లో ఉన్న జోష్ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇందులో పాల్గొని వారంతా ఆయా విభాగాల్లో ఒక్కో వీడియో పోస్టు చేసి ఛాలెంజ్ విసిరారు.ఇక వీరితో పాటు పాపులర్ సెలిబ్రిటీస్ కేపీవై బాలా, కింగ్స్ యునైటెడ్-సురేష్, రన్వీర్ బ్రార్, రుహీ సింగ్‌లు కూడా ఎక్‌నెంబర్‌ ఛాలెంజ్‌లో భాగస్వాములయ్యారు.

ఏక్ నెంబర్ ఛాలెంజ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది

ఇప్పటి వరకు ఈ ఛాలెంజ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ యూజర్స్ నుంచి వచ్చింది. ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన వారికి ఈ ఏక్ నెంబర్ ఛాలెంజ్‌ను విసురుతున్నారు. ఇక జోష్ ఐజీ ఫిల్టర్లతో వీడియోలకు మరింత ఫన్ చేకూరుతోంది. కేవలం మూడు రోజుల్లో ఏక్ నెంబర్ ఛాలెంజ్‌కు 54.9k వీడియోస్ రాగా వీటికి 99.5 మిలియన్ హార్ట్స్, 1.2 బిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

జోష్ ఏక్ నెంబర్ పై వైష్ణవి నాయక్

ఇక ఇప్పుడు ఏక్ నెంబర్ ఛాలెంజ్‌లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారి పేర్లను ప్రకటించే సమయం వచ్చేసింది. జోష్ ఏక్ నెంబర్ ఛాలెంజ్ విజేతల జాబితా ఇదే.

ఇక జోష్ ప్రకటించినట్లుగా విజేతలకు రూ. 50వేలు నగదు బహుమతి ఇవ్వడంతో పాటు విజేతల పేర్లు ఆల్‌స్టార్స్‌లో నమోదు చేయబడతాయి.అంతేకాదు విజేతలు కొందరు సెలబ్రిటీలను కూడా కలిసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వారు మెంటార్లుగా కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇక సోను సూద్ మరియు మౌనిరాయ్‌లు ప్రకటించిన విజేతల పేర్లు ఇవే..

మేహెల్ పటేల్

జయదీప్ మకవానా

జానీ నాకుమ్

అర్యన్ టైగర్

నీరజ్ సుకుమారన్ హిమా సాగర్

ఒమయిస్ ఖాన్

ఆరతీ రాజ్‌పుత్

రుచికా థాకూర్

మాధురీ దామరసింగు

జై రానా

విశాల్ మీనన్

శ్రీజితా మిశ్రా

ఇక జోష్ యాప్‌ పై ఏక్ నెంబర్ ఛాలెంజ్ విజేతలు వీరే

ఇక తొలి వార్షికోత్సవం సందర్భంగా జోష్ కూడా ఏక్ నెంబర్ జోష్ యానివర్శరీ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. జోష్ మే ఆజా అనే పేరుతో స్పెషల్ యానివర్శరీ వీడియోను రిలీజ్ చేసింది. ఈ మ్యూజిక్ వీడియోను క్లింటన్ సిరెజో మరియు బియాంకా గోమ్స్ కలిసి కంపోజ్ చేశారు. ఇక జోష్ తొలి వార్షికోత్సవం సందర్భంగా యూజర్లకు ఎన్నో స్పెషలిటీస్ అందించింది. ఇలాంటివి ఇంకా కావాలంటే జోష్ యాప్‌పై ట్యూన్ ఇన్ అవ్వండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+