• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Entertainment Unlimited:జోష్ వీడియో యాప్‌‌ను ఆవిష్కరించిన డైలీ హంట్..మస్తీ మజా..!

|

బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రముఖ న్యూస్ యాప్ డైలీ హంట్ సరికొత్త షార్ట్ వీడియో యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ పేరు జోష్. ఈ వీడియో యాప్ ఆవిష్కరణ కార్యక్రమం 9 సెప్టెంబర్ 2020న మధ్యాహ్నం 1 గంటకు జరిగింది. ఇప్పటి వరకు పలు విదేశీ వీడియో యాప్‌లకే ఎక్కువ క్రేజ్ ఉండేది. కానీ డైలీ హంట్ తీసుకొచ్చిన స్వదేశీ యాప్‌ జోష్‌ 10 భారతీయ భాషల్లో వస్తోంది. ఈ యాప్‌ను నేరుగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రారంభానికి ముందే ఈ జోష్ యాప్ సంచలనాలు క్రియేట్ చేస్తోంది.

ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా జోష్ యాప్

ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా జోష్ యాప్

ఇక ఈ కార్యక్రమం ప్రారంభంలో తొలుత డైలీ హంట్ వ్యవస్థాపకులు వీరేంద్ర గుప్తా మాట్లాడారు. "మన దేశంలో ఎన్నో విషయాలు కనుగొనబడ్డాయి. ఈ భూమిపైనే సున్నాను కనుగొనడం జరిగింది, ప్రపంచదేశాలు ప్రాక్టీస్ చేస్తున్న యోగా ఈ భూమిపైనే పుట్టింది. భారత్ ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించింది. అందులో ఒకటి జోష్ యాప్. డైలీ హంట్ తీసుకొచ్చిన ఈ వీడియో యాప్ జోష్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడింది. అదే సమయంలో భారతీయ ఇంజినీర్లు మాత్రమే దీనిపై పనిచేయడం జరిగింది. భారత క్రికెట్లో రాహుల్ ద్రావిడ్ ఎలాగైతే దృఢంగా నిలిచి జట్టుకు అండగా నిలిచారో.. అలానే జోష్ యాప్‌ను తీర్చిదిద్దడంలో ఇంజినీర్లు చాలా దృఢంగా పనిచేశారు. భారత సంస్కృతిని ప్రతిబింబించేలా యాప్ ఉంటుంది. ఆత్మనిర్భర్ భారత్‌, డిజిటల్ భారత్‌లో డైలీ హంట్ కూడా భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉంది.భారత సంస్కృతిని జోష్ యాప్ ద్వారా ప్రపంచానికి చాటుతాం" అన్నారు వీరేంద్ర గుప్తా. ఈ రోజు డైలీ హంట్ 300 మిలియన్ కస్టమర్లకు, 14 భాషల్లో 19వేల పిన్‌కోడ్‌లు ఉన్న ప్రాంతాలకు సేవలందిస్తోందని చెప్పారు వీరేంద్ర గుప్తా . ఈ రోజు నుంచి విదేశీ యాప్‌ల వైపు భారతీయులు చూడాల్సిన అవసరం లేదని అన్నారు.

భారత్‌కు జోష్ యాప్ అంకితం: ఉమాంగ్ బేడీ

భారత్‌కు జోష్ యాప్ అంకితం: ఉమాంగ్ బేడీ

ఇక డైలీహంట్ సహవ్యవస్థాపకులు ఉమాంగ్ బేడీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జోష్ యాప్ అతిపెద్ద లోకల్ లాంగ్వేజ్ యాప్ అని చెప్పిన ఉమాంగ్ బేడీ... 10 భారతీయ భాషల్లో వస్తోందని వెల్లడించారు. సృజనాత్మకత, వైవిధ్యాలను మేళవింపు చేసి భారతీయులకు అందించాలనే ఉద్దేశంతో డైలీ హంట్ ఈ గొప్పదేశానికి జోష్‌ యాప్‌ను అంకితం చేస్తోందని ఉమాంగ్ బేడీ అన్నారు. జోష్ ప్లాట్‌ఫాంపై ఎంతో మంది క్రియేటర్లు తమ వీడియోల ద్వారా ఎంటర్‌టెయిన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నో మ్యాజిక్ వీడియోస్‌ను, వైరల్ వీడియోస్‌ను ఈ యాప్‌పై వీక్షించొచ్చని చెప్పారు. జోష్ యాప్ భారత్‌లో భారతీయుల కోసం భారతీయులచే రూపొందించబడ్డ యాప్ అని డైలీ హంట్ భారత్‌కు అంకితం చేస్తోందని చెప్పారు. ఇక జోష్ యాప్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని చెప్పారు ఉమాంగ్ బేడీ. ప్లేస్టోర్‌లోకి తీసుకొచ్చిన కేవలం 45 రోజుల్లోనే అత్యధిక ఎంగేజ్‌మెంట్స్ ఉన్న యాప్‌గా జోష్ నిలిచింది. ఇప్పటి వరకు 50 మిలియన్ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోగా 23మిలియన్ డైలీ యాక్టివ్ యూజర్లు ఉన్నారన్నారు. ప్రతి యాక్టివ్ యూజర్ సగటున 21 నిమిషాలు యాప్‌పై సమయం గడుపుతున్నారని ఉమాంగ్ బేడీ చెప్పారు. రోజు ఒక బిలియన్ వీడియోలు ప్లే అవతున్నాయని వెల్లడించారు.

36 గంటల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని..

36 గంటల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని..

కేవలం 36 గంటల్లోనే చాలా ఛాలెంజెస్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఎదుర్కొందని చెప్పారు. మొత్తం 200 మంది క్రియేటర్లు తమ క్రియేటివిటీతో కూడిన వీడియోలను పోస్టు చేశారని చెప్పారు. జోష్ యాప్ కోసం ప్రత్యేక గీతంను రాశారు ప్రముఖ లిరిసిస్ట్ అమితాబ్ భట్టాచార్య. నెలకు 100మిలియన్ యాక్టివ్ యూజర్లు లక్ష్యంగా పనిచేస్తామని ఉమాంగ్ బేడీ చెప్పారు. భవిష్యత్తులో జోష్ చరిత్ర సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఉమాంగ్ బేడీ. ఈ యాప్‌లో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో అతిపెద్ద మ్యూజిక్ లైబ్రరీ ఉంది. ఇందుకోసం జోష్ యాప్ ప్రముఖ మ్యూజిక్ కంపెనీలతో జతకట్టింది. ఇందులో టీ సిరీస్, జీ మ్యూజిక్ , డివో, సోనీ మ్యూజిక్ సంస్థలతో అసోసియేట్ అయ్యింది. ఈ జోష్ యాప్‌లో అన్నిరకాల ఎమోషన్స్‌ను ఫీల్ అవ్వొచ్చు.

ఇక తెలుగులో అలరించేందుకు బిగ్ బాస్ సెలబ్రిటీలు దీప్తి సునయనా, అశురెడ్డి, హిమజా, లక్ష్మీరెడ్డిలు ఉన్నారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలైన బొమ్మ ముందుందని అది జోష్‌లో దొరుకుతుందని నిర్వాహకులు చెప్పారు. ఇక లాంచ్ సందర్భంగా జోష్‌లో టాప్ క్రియేటర్స్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది యాజమాన్యం.

English summary
India's leading news app Daily Hunt launched its small video app called Josh on the 9th of September 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X