దారుణం : ముసుగేసుకొచ్చి మహిళా జర్నలిస్టుపై కాల్పులు
ఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం జరిగింది. నోయిడాకు చెందిన మహిళా జర్నలిస్టుపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈస్ట్ ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల ఘటనలో గాయాలపాలైన ఆమె ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
నోయిడాకు చెందిన మిథాలీ చందోలా శనివారం డ్యూటీ ముగించుకుని కారులో ఇంటికి బయలుదేరారు. అప్పుడు సమయం అర్థరాత్రి 12.30గంటలు దాటింది. ఆమె కారు డ్రైవ్ చేస్తుండగా.. మారుతి స్విఫ్ట్ కారు ఆమెను ఓవర్ టేక్ చేసింది. అందులోంచి దిగిన ముసుగు ధరించిన వ్యక్తి మిథాలీపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అందులో ఒక బులెట్ ఆమె చేతికి తగలడంతో తీవ్ర రక్త స్రావమైంది. దాడికి ముందు దుండగులు మిథాలీ కారుపై కోడి గుడ్లతో దాడి చేశారు.

కాల్పుల షాక్ నుంచి తేరుకున్న మిథాలీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆమెను ఈస్ట్ ఢిల్లీలోని ధర్మశిల హాస్పిటల్‌కు తరలించారు. ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్లు మిథాలీకి ఎలాంటి ప్రాణాపాయం లేని చెప్పారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మిథాలీపై కాల్పుల కేసుకు సంబంధించి పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన వెనుక బైక్‌లపై వెళ్లే వారిపై గుడ్లు విసిరి దోపిడీకి పాల్పడే ముఠాల హస్తం ఉందా అన్న దిశగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వ్యక్తిగత కక్షతో దుండగులు దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక సాక్ష్యాలను బట్టి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలే దాడికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. 2008లోనూ ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. సౌత్ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో సౌమ్య విశ్వనాథన్ అనే 26 ఏళ్ల జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications