దాడి, జర్నలిస్టును బైక్‌కు కట్టి లాక్కెళ్లారు (వీడీయో)
ఉత్తరప్రదేశ్: నిందితులకు వ్యతిరేకంగా వార్తలు వ్రాసిన జర్నలిస్టు మీద దుండుగులు దాడి చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. దాడి చేసిన నిందితులు అతనిని సినిమా ఫక్కీలో బైక్ కు కట్టి ఈడ్చుకుని వెళ్లారు. తరువాత వార్నింగ్ ఇచ్చి అతనిని రోడ్డు మీద వదిలి పరారైనారు.
ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ జిల్లాలో హైదర్ ఖాన్ అనే జర్నలిస్టు నివాసం ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం ఆనంద్ అనే వ్యక్తి హైదర్ ఖాన్ కు ఫోన్ చేశాడు. తరువాత ఒక దొంగతనం కేసులోని ప్రత్యక్ష సాక్షి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని చెప్పాడు.
ఆ సాక్షిని ఆసుపత్రికి తరలించడానికి సహాయం చెయ్యాలని, వెంటనే రావాలని చెప్పాడు. హైదర్ ఖాన్ వెంటనే అక్కడికి వెళ్లాడు. ఆ సందర్బంలో నిందితులు హైదర్ ఖాన్ మీద దాడి చేశారు. తరువాత అతనిని కారులో నుండి బయటకు లాగేశారు.
చివరికి రోడ్డు మీద దాడి చేసిన నిందితులు అతనిని తాళ్లతో బైక్ కు కట్టి సినిమాలలో లాగా 100 మీటర్లకు పైగా ఈడ్చుకుని వెళ్లారు. తీవ్రగాయాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పిలిభిత్ జిల్లా ఎస్సీ జేకే. షాహీ తెలిపారు.
మంత్రి షాకింగ్ కామెంట్
జర్నలిస్టును సజీవ దహనం చేశాడన్న ఆరోపణల పైన యూపీ మంత్రి రామ్ మూర్తి వర్మను వెనకేసుకొచ్చేందుకు ఆ రాష్ట్ర మంత్రివర్గం ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూపీ హార్టీకల్చర్ మినిస్టర్ పరాశ్ నాథ్ మాట్లాడుతూ.. ప్రకృతితో మనం యుద్ధం చేయగలమా? చేయలేం. కొన్నిసార్లు అలా జరుగుతుందని, మనం ఆపలేమని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications