బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జేపీ నడ్డా...

జాతీయ బీజేపీకి మరో కొత్త సారధిని నియమించారు. కేంద్రమంత్రి జేపి నడ్డాను బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా నడ్డా ఇటివల జరిగిన ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌కు ఇంచార్జ్‌గా ఉన్నారు. యూపిలో పార్టీని గట్టేక్కించి మహఘట్‌బంధన్‌కు దీటుగా బీజేపీకి రెండవ సారి అధికారంలోకి రావడానికి యూపి నుండి అత్యధిక స్థానాలు వచ్చిన విషయం తెలిసిందే...

పార్టీ చీఫ్‌గా ఉన్న అమిత్ షా ఇటివల జరిగిన ఎన్నికల్లో గాంధి నగర్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి హోంమంత్రిగా భాద్యతలు స్వీకరించాడు . ఈనేపథ్యంలోనే పార్టీకి కొత్త బాస్‌ కోసం పార్టీ సమావేశం కూడ ఏర్పాటు చేసింది. అయితే రానున్న కొద్ది రోజుల్లో నాలుగు రాష్ట్ర్రాల ఎన్నికలు ఉండడంతో ప్రస్థుతం పార్టీ చీఫ్‌ను తప్పించే అంశాన్ని పక్కన పెట్టారు. ఎన్నికలు ముగిసేవరకు పార్టీ అధ్యక్షుడుగా అమిత్‌షానే కొనసాగించాలని నిర్ణయించారు.

JP Nadda as the party’s national working president

ఇక అమిత్ షా కీలకమైన హోంమంత్రిత్వ శాఖను చేపట్టడంతో, పని భారం తగ్గించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ పదవి క్రియోట్ చేశారు. దీంతో పార్టీ సినియర్ నాయకుడు ఉత్తర ప్రదేశ్‌లో కీలక పాత్రను పోషించిన జేపినడ్డాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినట్టు ప్రకటించారు. ఒకవేళ అమిత్ షాను గనుక పార్టీ నుండి తప్పించి ఉంటే జేపి నడ్డానే పార్టీ చీఫ్‌గా ఎన్నుకునే అవకాశాలు ఉండేవి. కాగా గతంలో ఎప్పుడు లేని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ పదవిని బీజేపీ ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+