జమిలిపై జేపీసీ: ప్రియాంక తోపాటు 31 మంది సభ్యులు, ఏపీ నుంచి వీరే
జమిలి ఎన్నికలపై కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. జమిలి ఎన్నికల బిల్లుల పరిశీలన కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)ని కేంద్రం ఏర్పాటు చేసింది. పీపీ చౌదరి ఛైర్మన్‌గా ఏర్పాటైన ఈ కమిటీలో బీజేపీ తరపున అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ తదితరులకు చోటు కల్పించింది.
వివిధ పార్టీలకు చెందిన మొత్తం 31మంది సభ్యులతో కూడిన జేపీసీలో లోక్‌సభ నుంచి 21 మంది సభ్యులు రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులను స్పీకర్ ఓం బిర్లా నియమించారు. లోక్‌సభ నుంచి చోటు దక్కించుకున్న 21 మంది సభ్యుల్లో పీపీ చౌదరి, సీఎం రమేశ్, బాన్సురీ స్వరాజ్, పురుషోత్తమ్ రూపాలా, అనురాగ్ ఠాకూర్, విష్ణు దయాళ్ రామ్, భర్తృహరి మహ్తాబ్, సంబిత్ పాత్రా, అనిల్ బలూనీ, విష్ణుదత్ శర్మ, ప్రియాంక గాంధీ వాద్రా, మనీష్ తివారీ, సుఖదేవ్ భగత్, ధర్మేంద్ర యాదవ్, కళ్యాన్ బెనర్జీ, టీఎం సెల్వ గణపతి, జీఎం హరీశ్ బాలయోగి, సుప్రియా సూలే, శ్రీకాంత్ షిండే, చందన్ చౌహాన్, వల్లభనేని బాలశౌరి ఉన్నారు.

కాగా, ఈ కమిటీలో ఏపీ నుంచి ముగ్గురు సీఎం రమేశ్, బాలశౌరి వల్లభనేని, జీఎం హరీశ్ బాలయోగి సభ్యులుగా ఉండటం గమనార్హం. వీరితోపాటు రాజ్యసభ నుంచి 10 మంది సభ్యుల పేర్లను ప్రతిపాదించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల చివరి వారంలో ఈ కమిటీ నివేదిక సమర్పించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కాగా, దేశంలో ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఓటింగ్ ప్రక్రియ ద్వారా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. దీంతో 90 నిమిషాల చర్చ తర్వాత ఓటింగ్ జరగ్గా బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటేశారు. ఈ క్రమంలో బిల్లును ప్రవేశపెట్టడానికి స్పీకర్ ఓం బిర్లా ఆమోద ముద్ర వేశారు.
అయితే, ఈ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా కేంద్రం నియంతృత్వంగా వ్యవహరించిందని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. వాటిని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో విపక్షాల డిమాండ్ నేపథ్యంలో బిల్లును జేపీసీకి పంపడానికి తమకేమీ అభ్యంతరం లేదని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ బిల్లును పరిశీలించేందుకు తాజాగా 31 మంది సభ్యులతో కేంద్రం జేపీసీని ఏర్పాటు చేసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications