లాలూ ప్రసాద్ యాదవ్‌కు జడ్జి మరో దిమ్మతిరిగే కౌంటర్
పాట్నా: దాణా కుంభకోణం కేసులో జైల్లో ఉన్న ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు జడ్జి మరోసారి కౌంటర్ ఇచ్చారు. లాలూను కలవడానికి వారానికి కేవలం ముగ్గురే రావాలని సీబీఐ న్యాయమూర్తి శివపాల్ సింగ్ ఆదేశించారు. ఈ విషయం గురించి పునరాలోచించాల్సిందిగా బుధవారం లాలూ న్యాయమూర్తిని కోరారు.
సంక్రాంతి పండుగ వస్తోందని, తమ ఇంట్లో దహీ చుర్రా (మిఠాయి)తో అట్టహాసంగా పండుగ జరుపుకుంటామని, తనను కలవడానికి వారంలో కేవలం ముగ్గురికే అనుమతిస్తున్నారని లాలూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై మరోసారి ఆలోచించాలని కోరారు. ఆ అధికారం మీకు ఉందని జడ్జితో చెప్పారు.

ఇందుకు జడ్జి ధీటైన కౌంటర్ ఇచ్చారు. ఆ మిఠాయి నీకు అందేలా చూస్తానని, కానీ ముగ్గురు విజిటర్లకు మించి లోనికి అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. ఇందుకు లాలూ స్పందిస్తూ.. తాను లాయర్‌ను అని, సుప్రీం, హైకోర్టులలో న్యాయవాదిగా తన పేరు నమోదై ఉందని, తన ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని శిక్ష వేస్తానని చెప్పారని, కానీ మూడున్నరేళ్లు జైలు శిక్ష విధించారని అన్నారు.
Recommended Video

దీనికి జడ్జి శివపాల్ స్పందిస్తూ.. కానీ నువ్వు రిజిస్ట్రేషన్ నెంబర్ సమర్పించలేదని, అందుకే నీకు మూడున్నరేళ్లు శిక్ష వేశానని చెప్పారు. ఇంతకుముందు కూడా లాలూ తనకు జైల్లో చలిగా ఉందని చెప్పడంతో న్యాయమూర్తి చలేస్తే తబలా వాయించుకో అని చురకలు అంటించారు. కాగా, దాణా కుంభకోణంలో లాలూ జైలుకు వెళ్లడం ఇది ఎనిమిదో సారి. ప్రస్తుతం లాలూ ఝార్ఖండ్‌లోని హజరిబాగ్ ప్రాంతంలో ఉన్న ఓపెన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications