ప్రొఫెసరక్లు కాలేజ్ అమ్మాయిల వల, సెక్స్ పాఠాలు జీవితాలు నాశనం, కోర్టుకు మేడమ్ !
చెన్నై: మదురై కామరాజర్ యూనివర్శిటీలో పై అధికారుల దగ్గరకు కాలేజ్ అమ్మాయిలను పంపించి వారి కోరికలు తీర్చాలని సెక్స్ పాఠాలు చెప్పిన కేసులో అరెస్టు అయిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవిని మరింత విచారణ చెయ్యాలని సీబీసీఐడీ అధికారులు నిర్ణయించారు. నిర్మలా దేవి కస్టడీని పొడిగించాలని సీబీసీఐడి ఎస్సీ రాజేశ్వరి మనవి చెయ్యడంతో కోర్టు అంగీకరించింది.

నిర్మలా దేవి హాజరు
సాతూర్ కోర్టు ఐదు రోజుల పాటు నిర్మలా దేవిని విచారణ చెయ్యడానికి సీబీసీఐడీ అధికారుల కస్టడీకి అప్పగించారు. బుధవారం కస్టడీ గడువు పూర్తి కావడంతో గట్టిబందోబస్తుతో నిర్మలా దేవిని సాతూరు కోర్టులో హాజరుపరిచారు. ఆ సందర్బంలో మహిళా సంఘాలు నిర్మలా దేవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కస్టడీ పొడగింపు
నిర్మలా దేవి వ్యవహారం లోతుగా దర్యాప్తు చెయ్యడానికి ఆమెను మరికొన్ని రోజులు విచారణ చెయ్యడానికి అనుమతి ఇవ్వాలని సీబీసీఐడీ అధికారులు న్యాయస్థానంలో మనవి చేశారు. నిర్మలా దేవి జ్యూడీషియల్ కస్టడీ మే 9వ తేదీ వరకు పొడగించారు.

అమ్మాయిల జీవితాలు
అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవిని విచారణ చెయ్యడానికి సీబీసీఐడీ అధికారులకు న్యాయస్థానం ఐదు రోజులు అనుమతి ఇచ్చింది. కాలేజ్ అమ్మాయిల జీవితాలకు సంబంధించిన కేసు కావడంతో పూర్తి సమాచారం సేకరించాలని సీబీసీఐడి అధికారులు నిర్ణయించారు.

కీచకులు మాయం
నిర్మలా దేవి వ్యవహారం వెలుగు చూసిన వెంటనే మదురై కామరాజర్ యూనివర్శిటీకి చెందిన అనేక మంది కీచక ప్రోఫెసర్లు, వారికి సహకరించిన స్కాలర్ విద్యార్థులు మాయం అయ్యారు. వారి కోసం సీబీసీఐడి అధికారులు గాలిస్తున్నారు.

ముందస్తు బెయిల్
సీబీసీఐడీ అధికారులు అరెస్టు చేస్తారనే భయంతో నిర్మలా దేవికి సహకరించిన కొందరు ముందస్తు జామీను తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నిర్మలా దేవితో పాటు కాలేజ్ అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడిన వారికి బెయిల్ మంజూరు చెయ్యరాదని సీబీసీఐడీ అధికారులు కోర్టుకు మనవి చేస్తున్నారు.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications