ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన: నదిలో పడిన వాహనాలు(వీడియోస్)
Recommended Video
గాంధీనగర్: గుజరాత్‌లోని జూనాగఢ్‌లోని మలంక గ్రామంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. దీంతో ఆ వంతెనపై ప్రయాణిస్తున్న వాహనాలు బ్రిడ్జితోపాటు నదిలో పడిపోయాయి. దీంతో వాహనాల్లోని ప్రయాణికులు ప్రాణభయంతో అరుపులు, కేకలు పెట్టారు.

నదిలో పడ్డ కార్లు
సుమారు 60 అడుగుల ఎత్తులో ఉన్న ఈ వంతెన ఒక్కసారిగా కూలడంతో వాహనాలు నదిలో పడిపోయాయి. ఓ కారు నదిలో పడేస్థితిలో ఉండగా అందులోని ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించి బయటపడ్డారు.
కాపాడిన స్థానికులు
అక్కడేవున్న స్థానికులు ప్రయాణికులను కాపాడారు. ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఈ క్రమంలోనే బ్రిడ్జి కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు.
అంతరాయం..
ఈ ఘటనలో 14మంది గాయపడగా.. వారందరినీ సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బ్రిడ్జి కూలడంతో ఆ మార్గం గుండా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అధికారులు ఈ ఘటనపై సమీక్షిస్తున్నారు.

సెల్ఫీ కోసం వెళ్తే నాలుగు ప్రాణాలు పోయాయి..
ఇది ఇలా ఉండగా, తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి జలాశయంలో పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఊత్తంగరై పాంబారు జలాశయం సమీపంలోని ఒడ్డపట్టి గ్రామానికి చెందిన సంతోష్(14), వినోద(18), స్నేహ(19), నివేద(20) ఆదివారం సాయంత్రం జలాశయాన్ని సందర్శించేందుకు వెళ్లారు.

సెల్ఫీ తీసుకోబోతుండగా అదుపుతప్పి
అక్కడ సెల్ఫీ తీసుకోబోతుండగా అదుపుతప్పి గట్టుపై నుంచి నీటిలో పడిపోయారు. అక్కడే ఉన్న కొందరు స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆ నలుగురి మృతదేహాలను జలాశం నుంచి బయటకు తీశారు. సెల్ఫీలో పిచ్చిలో పడి ప్రాణాలు తీసుకోవద్దంటూ పోలీసుశాఖవారు చెబుతున్నప్పటికీ.. యువత ఏమాత్రం పట్టించుకోకుండా వారి తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications