యోగా డే...ఉత్సవాలు.. రాంచీలో పాల్గోన్న మోడీ, ఇతర ప్రముఖులు వీడీయో

Recommended Video

    International Yoga Day 2019: 'యోగా డే' ఉత్సవాలు... యోగా కార్యక్రమంలో పాల్గోన్న మోడీ!!

    అయిదవ అంతర్జాతీయ దినోత్సవం సంధర్భంగా ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గోన్నారు. ఆయన యోగా కార్యక్రమానికి నేత‌ృత్వం వహించారు. రాంచీలోని ప్రభాత్ తార మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 40 వేల మంది పాల్గోన్నారు. వారితో కలిసి ప్రధాని మోడీ యోగా ఆసనాలు వేశారు.

    యోగాకు కులం మతం లేదు.. మోడీ

    ఈ సంధర్భంగా మోడీ సందేశం ఇచ్చారు. యోగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అన్నారు.ఇది అనారోగ్యాన్ని దరి చేయకుండా కాపాడుతుందని చెప్పారు.క్రమ శిక్షణ అంకిత భావంతో యోగాను ప్రాక్టీస్ చేయాలని పిలుపునిచ్చారు.యోగాకు కులాలు,మతాలు లేవని అన్నారు. అది అన్ని వర్గాలు చేయాల్సిన అవసరముందని అన్నారు. మన సంసృతిలో భాగంగా యోగాను ఇనుముడింపజేసుకోవాలని ఆయన కోరారు. ఈ సంధర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సం జరుపుకుంటున్న వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.యోగాకు ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వార సేవలు అందిస్తామని స్సష్టం చేశారు.

     పాల్గోన్న అమిత్ షా

    పాల్గోన్న అమిత్ షా

    ఇక ప్రపంచ యోగా డే సంధర్భంగా యూనియన్ హోం మంత్రి అమిత్ షా, హర్యాణ ముఖ్యమంత్రి ఎంఎల్ ఖతార్‌తో రోతక్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గోన్నారు.ఇక యోగా గురువు రాందేవ్ బాబా నాందేడ్‌లో నిర్వహించిన కార్యక్రమంలోపాల్గోన్నారు. రాందేవ్ బాబాతోపాటు మహారాష్ట్ర్ర సీఎం ఫడ్నవీస్ పాల్గోన్నారు.

    సైనికులు

    సైనికులు

    మరోవైపు ఐటీబీపికి చెందిన సైనికులు సిక్కింలోని 19000 అడుగుల ఎత్తులో మైనస్ 15 డిగ్రిల ఉష్ణోగ్రతలో యోగాసనాలు వేశారు.

    హిమాచల్

    హిమాచల్

    ఇక హిమాచల్ ప్రదేశ్‌లోని 14000 అడుగుల ఎత్తులో ఉన్న రోహ్‌తంగ్‌ పాస్ వద్ద మైనస్ 10 డిగ్రిల ఉష్ణోగ్రతలో యోగాను నిర్వహించారు.

    నదిలో యోగా

    నదిలో యోగా

    అరుణాచల్ ప్రదేశ్‌లోని దిగారు నదిలో కూడ యోగాను నిర్వహించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+