రేప్ యత్నం విఫలం: ఐసియులో జూ. డాక్టర్ హత్య

Junior doctor killed after suspected failed rape attempt
గౌహతి: అస్సాం వైద్య కళాశాల, ఆస్పత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో 24 ఏళ్ల జూనియర్ డాక్టర్ సరిత తష్నివాల్ హత్యకు గురైంది. అత్యాచార యత్నం విఫలం కావడంతో ఆమెను చంపినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసులో నిందితుడైన వార్డ్‌బాయ్ తిరు మెచ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

అతనిపై తాజాగా గోళ్లతో గీరిన గుర్తులు కనిపించాయి. అత్యాచార యత్నం చేసినప్పుడు జరిగిన పెనుగులాటలో అతనికి ఆ మరకలు అయినట్లు భావిస్తున్నారు. రాత్రి పూట విధులు నిర్వహించే సమయంలో సరితపై దాడి, హత్య జరిగాయని పోలీసులు చెబుతున్నారు.

సరిత తనతో అనుచిత రీతిలో ప్రవర్తించిందని, దీంతో తాను అత్యాచార యత్నానికి పాల్పడ్డానని మెచ్ చెప్పినట్లు సమాచారం. శస్త్రచికిత్స చేసే కత్తితో ఆమెను హత్య చేసినట్లు అతను అంగీకరించాడు. జూనియర్ డాక్టర్ శవాన్ని నర్సులు శనివారం ఉదయం చూశారు.

సరితకు జూలై 7వ తేదీన వివాహం జరగాల్సి ఉండింది. ఆమె ఎండి కోర్సు చదువుతోంది. ఈ సంఘటనలో ఇతరు ప్రమేయం కూడా ఉందా అనే విషయాన్ని తేల్చుకోవడానికి పోలీసులు సిసిటివి ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+