సుప్రీంలో కర్ణన్ రివ్యూ పిటిషన్: జైలు శిక్షను పున:సమీక్షించాలని వినతి!
ఓవైపు ఆయన కోసం పోలీసుల వేట కొనసాగుతుండగానే రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. కాగా, ఈ రివ్యూ పిటిషన్ విచారణకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జగదీశ్ సింగ్ ఖెహర్ సానుకూలంగా స్పందించారు.
న్యూఢిల్లీ: తనకు విధించిన ఆరు నెలల జైలు శిక్షను పున: సమీక్షించాల్సిందిగా కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు దిక్కారణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారో ఆచూకీ తెలియడం లేదు.
ఓవైపు ఆయన కోసం పోలీసుల వేట కొనసాగుతుండగానే రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. కాగా, ఈ రివ్యూ పిటిషన్ విచారణకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జగదీశ్ సింగ్ ఖెహర్ సానుకూలంగా స్పందించారు. పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

అదే సమయంలో కర్ణన్ ఆచూకీ గురించి ఆయన తరుపు న్యాయవాది మాథ్యూ జె.నెదుమ్ పరాను ఖెహర్ ఆరా తీశారు.
కాగా, సుప్రీం ఆదేశాల మేరకు కర్ణన్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగా.. అ్పటికే ఆయన కోల్ కతాను వీడినట్లు తెలిసింది. ప్రస్తుతం కర్ణన్ కోసం పోలీసులు వేట కొనసాగుతూనే ఉంది.












Click it and Unblock the Notifications