సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి ఖరార్
దేశ అత్యున్నత న్యాయస్థానానికి కొత్త ప్రధాన న్యాయమూర్తి రాబోతోన్నారు. నవంబర్ 24వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్టే. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయనుండటంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. వచ్చే నెల 23వ తేదీన గవాయ్ పదవీ విరమణ చేయనున్నారు.
ఆయన తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ తదుపరి CJIగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు గవాయ్ ఆయన పేరును కేంద్రానికి అధికారికంగా సిఫారసు చేశారు. నెల రోజుల్లో గవాయ్ పదవీ విరమణ చేయాల్సి రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 23వ తేదీన తదుపరి సీజేఐ ఎంపిక ప్రక్రియను చేపట్టింది. గవాయ్ వారసుడి పేరును సిఫారసు చేయాలని కోరుతూ కేంద్రం లేఖ రాసింది.

సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలను పర్యవేక్షించే మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం.. అత్యంత సీనియర్ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించాల్సి ఉంటుంది. సాధారణంగా- ప్రస్తుత చీఫ్ జస్టిస్ పదవీ విరమణకు ఒక నెల ముందు కేంద్ర న్యాయ శాఖ సిఫారసును కోరుతుంది. దీనికి అనుగుణంగా తాజాగా గవాయ్.. సీనియారిటీ ప్రకారం జస్టిస్ సూర్యకాంత్ పేరును తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా కేంద్రానికి సిఫారసు చేశారు.
జస్టిస్ సూర్యకాంత్ స్వరాష్ట్రం.. హర్యాన. 1962 ఫిబ్రవరి 10న హిస్సార్‌లో జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకు అంటే సుమారు 15 నెలల పాటు ఆయన సీజేఐగా కొనసాగుతారు. న్యాయ వృత్తిలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. వాక్ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, అవినీతి, పర్యావరణం, లింగ సమానత్వం, ఆర్టికల్ 370 రద్దు వంటి అనేక కీలక అంశాలపై చారిత్రాత్మక తీర్పులు ఇచ్చారు.
వారసత్వ రాజద్రోహ చట్టాన్ని నిలిపివేసిన బెంచ్‌లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. బీహార్‌లో ఓటర్ల వివరాలను వెల్లడించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. బార్ అసోసియేషన్లలో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్ కల్పించాలని తీర్పునిచ్చారు. పెగాసస్ స్పైవేర్ దర్యాప్తు, 2022లో ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం, రక్షణ సిబ్బందికి వన్ ర్యాంక్-వన్ పెన్షన్ పథకం వంటి కీలక కేసులను విచారించిన బెంచ్‌లలోనూ జస్టిస్ సూర్య కాంత్ ఉన్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications