నటి కాజోల్ ఇంట్లో దొంగతనం: నిందితుల పట్టివేత

 Kajol
ముంబై: బాలీవుడ్ నటి కాజోల్ నివాసంలో దొంగతనం జరిగింది. కాజోల్‌కు సంబంధించిన 17 బంగారు గాజులను దొంగిలించిన ఇద్దరు పని మనుషులను ముంబై పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. గత మూడు సంవత్సరాల నుంచి కాజోల్ నివాసంలో పనిచేస్తున్న వారు కొన్ని రోజుల క్రితం ఇంట్లోని బంగారు ఆభరణాల దొంగతనానికి పాల్పడ్డారు.

జుహు పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైలోని జుహులో ఉన్న భవనంలో కాజోల్, ఆమె భర్త అజయ్ దేవగణ్ నివాసముంటున్నట్లు పోలీసులు తెలిపారు. వారి నివాసంలో 12మంది పని మనుషులు ఉన్నట్లు తెలిపారు. దీపావళి పండగ సందర్భంగా తమ ఇంటిని శుభ్రం చేసేందుకు మరో ముగ్గురు పని మనుషులను అక్టోబర్ 15న తీసుకున్నారు.

కాగా అక్టోబర్ 23న కాజోల్ తనకు సంబంధించిన రూ. 5లక్షల విలువైన బంగారు గాజులు పోయినట్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎవరైతే కొత్తగా తన నివాసంలో పని మనుషులుగా వచ్చారో వారిపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. అక్టోబర్ 23న తన పడకగదిలోని ఒక పెట్టెలో ఆ గాజులను భద్రపర్చినట్లు పోలీసులకు కాజోల్ తెలిపింది. తదుపరి రోజు అందులోనే ఉన్నట్లు గుర్తించానని, అక్టోబర్ 22న అవి అదృశ్యమైనట్లు కనుగొన్నట్లు ఆమె తెలిపింది.

తమ విచారణలో కాజోల్ నివాసంలో గతమూడు సంవత్సారాలుగు పని చేస్తున్న సంతోష్ పాండే, గాయత్రి దేవేంద్రన్‌‌లు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. బంగారు గాజులు, ఇతర ఆభరణాలను దొంగిలించిన నిందితులు సెరిసగం పంచుకున్నారని, కొంతకాలం తర్వాత అమ్మేయాలనుకున్న నిందితులు బంగారు గాజులను మురికి కాలువలో దాచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ నిందితులను మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత నిందితులను పోలీసులు కస్టడీకి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+