నేడే కాలాష్టమి.. బీ అలర్ట్- ఈ పొరపాట్లు చెయ్యొద్దు
వారణాశి: నేడు కాలాష్టమి. కాల భైరవుడిని పూజించే రోజు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కాలాష్టమి నాడు భైరవుడికి భక్తులు ఘనంగా పూజలు చేస్తారు. భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరిస్తారు. వారణాశి, ఉజ్జయిని ఆలయం సహా ప్రఖ్యాత శైవ క్షేత్రాల్లో మహా శివుడికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారివ్వాళ.
కాలాష్టమి నాడు కాల భైరవుడిని పూజించడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ రోజున ఉపవాసాన్ని పాటిస్తారు. కాల భైరవుడిని పూజిస్తారు. ప్రతి నెలా కృష్ణ పక్షంలో కాలాష్టమి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అధిక శ్రావణ మాసంలో జరగనున్న ఈ కాలాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది.

అష్టమి తిథి ఈ తెల్లవారు జామున 4:14 నిమిషాలకు ఆరంభమౌతుంది. బుధవారం తెల్లవారు జామున 3:52 నిమిషాలకు ముగుస్తుంది. సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానాన్ని ఆచరించాాలి. శుభ్రమైన దుస్తులను ధరించి, కాల భైరవుడిని దర్శించుకోవాలి. నల్ల నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి.
కాల భైరవుడు సాక్షాత్ పరమేశ్వర స్వరూపుడు కావడం వల్ల దగ్గరలో భైరవాలయం లేకపోతే శివుడిని దర్శించుకోవచ్చు. శివలింగానికి అభిషేకం చేసి, కాలభైరవాష్టకాన్ని పఠించడం వల్ల బాధలు తొలగిపోతాయి. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని ప్రతీతి.

సర్వదోషాలు, కష్టాల విముక్తి పొందడానికి నల్లకుక్కకు తీపి రొట్టె లేదా గారెలను తినిపించడం వల్ల కాల భైరవుడు సంతృప్తి చెందుతాడని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు. కాలాష్టమి నాడు శునకాలను కొట్టడం, హింసించడం వంటి పనులు చేయకూడదని, వాటికి ఆహారం, మంచినీటిని అందించడం వల్ల మేలు కలుగుతుందని విశ్వసిస్తారు.

కాలభైరవుడు క్షేత్రపాలకుడు. కాశీ విశ్వనాథుడి ఆలయానికి వెళ్లడానికి ముందు కాలభైరవుడిని దర్శించుకోవాలని, ఆయన అనుమతి తీసుకోవాలని చెబుతుంటారు. ముందుగా కాలభైరవుడిని దర్శించుకున్న తరువాత ప్రధాన ఆలయానికి వెళ్తుంటారు. వారణాశిలోని కాలభైరవాలయం సమీపంలో ఉన్న బావిలోకి సర్వకాల సర్వావస్థల్లోనూ నీళ్లు ఊరుతూనే ఉంటాయి. ఆ జలానికి రోగవిముక్తి చేసే శక్తి ఉందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications