ప్రధాని మోడీకి వ్యతిరేకం: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో హీరో కమల్ హాసన్ భేటీ !
పశ్చిబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో త్వరలో కమల్ హాసన్ భేటీప్రధాని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్న సీఎంలతో కమల్ హాసన్ మాటామంతికమల్ హాసన్ అడుగులు ఎటు వేస్తున్నారో అంటూ ఆయన అభిమానుల చర్చ
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో త్వరలో అడుగుపెడుతున్న బహుబాష నటుడు కమల్ హాసన్ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కావడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. తన రాజకీయ భవిషత్యు సాఫిగా ముందుకు సాగడానికి సీనియర్ రాజకీయ నాయకుల సలహాలు, సూచనలు తీసుకోవడానికి సిద్దం అయ్యారు.
ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయిన కమల్ హాసన్ పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. తాజాగా ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ కావాలని ప్రయత్నిస్తున్నారని వెలుగు చూసింది.

ప్రధాని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రులతోనే కమల్ హాసన్ భేటీ కావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలోనే ఎంతో సీనియర్ నాయకురాలు అయిన మమతా బెనర్జీతో భేటీ అయ్యి రాజకీయాలపై ఆమె సూచనలు, సలహాలు తీసుకోవాలని కమల్ హాసన్ సిద్దం అవతున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. బీజేపీకి వ్యతిరేకంగానే కమల్ హాసన్ అడుగులు వెయ్యాలని నిర్ణయించారని సమాచారం.












Click it and Unblock the Notifications