కెమెరాల ముందు కనపడాలనే ఆరాటం: రజనీపై కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు!

అభిమానుల సంగతి పక్కనపెడితే.. రజనీ తమిళుడు కాదన్న కారణాన్ని చూపిస్తున్నవారికి భారతీరాజా లాంటి దర్శకులు సైతం వంత పాడటం చర్చనీయాంశంగా మారింది.

చెన్నై: తమిళ తెర మీద రజనీ పొలిటికల్ ఎంట్రీ ఊగిసలాడుతున్న తరుణంలో.. రాష్ట్రంలో ఏ నలుగురు ఒకచోట కలిసినా దీని గురించే చర్చిస్తున్నారు. దీనికి తోడు అటు వ్యతిరేక-అనుకూల వర్గాలు ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగిపోయారు. రజనీని అడ్డుకోవాలని కొంతమంది.. రజనీని రాజకీయాల్లోకి లాగడానికి ఇదే చివరి అవకాశమని మరికొంతమంది.. మొత్తం మీద రజనీ రాజకీయం ఇప్పుడు తమిళనాడులో ఓ హాట్ టాపిక్.

అభిమానుల సంగతి పక్కనపెడితే.. రజనీ తమిళుడు కాదన్న కారణాన్ని చూపిస్తున్నవారికి భారతీరాజా లాంటి దర్శకులు సైతం వంత పాడటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా విలక్షణ నటుడు కమల్ హాసన్ సైతం రజనీపై వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రజనీ పొలిటికల్ ఎంట్రీ గురించి స్పందిస్తూ.. ఆయనకు కెమెరాల ముందు కనపడాలనే ఆరాటం ఎక్కువగా ఉందన్నారు కమల్.

kamal hassan controversial comments on rajinikanth political entry

కెమెరాల ముందు కనపడాలన్న ఆరాటంతోనే.. ఇలా లేని పోని హడావుడి చేస్తున్నారని పేర్కొన్నారు. కెమెరాలు ఎక్కడుంటే అక్కడ రజనీ ప్రత్యక్షమవుతారని కమల్ ఒకింత ఘాటుగానే స్పందించారు. కమల్ వ్యాఖ్యలను బట్టి.. రజనీ పొలిటికల్ ఎంట్రీ పట్ల తమిళ సినీ రంగంలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+