అక్కడికే పరిమితం: కమల్ హాసన్‌కు శశికళ వర్గం నేత తీవ్ర హెచ్చరిక

ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు అన్నాడీఎంకే అధినేత్రి శశికళ వర్గం నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. కమల్ కొన్ని కలలు కంటున్నారని, అవి నెరవేరవని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి వైగాయి సెల్వన్ అన్నారు.

చెన్నై: ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు అన్నాడీఎంకే అధినేత్రి శశికళ వర్గం నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. కమల్ కొన్ని కలలు కంటున్నారని, అవి నెరవేరవని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి వైగాయి సెల్వన్ అన్నారు.

కమల్ హాసన్ కలలు

ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందని ఆయన కలలు కంటున్నారని, అలాంటి కలలు మానుకోవాలని ఆదివారం నాడు హితవు పలికారు.

సినిమాలకే పరిమితం కావాలి

ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై అన్నాడీఎంకే మండిపడింది. కమల్ ఓ సినీ నటుడు అని, ఆయన కంటున్న కలలు సినిమాలకు మాత్రమే పరిమితం అన్నారు.

Kamal’s dream will never come true: ADMK Spokesperson Vaigai Selvan

ప్రజల సంక్షేమం కోసమే..

త్వరలోనే తమిళనాడులో ఎన్నికలు జరుగుతాయన్న కమల్ హాసన్ ఆశలు నెరవేరవని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందని తెలిపారు. విజయవంతంగా ముందుకు సాగుతుందన్నారు.

రెండాకుల గుర్తుతో..

ఏప్రిల్ 12వ తేదీన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ రెండాకుల గుర్తుతోనే పోటీ చేసి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఆర్కే నగర్‌లో ఈసారి పోటీ రసవత్తరంగా కనిపిస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకే, దీపా జయకుమార్, పన్నీరు సెల్వం వర్గంతో పాటు విజయకాంత్ పార్టీ కూడా పోటీ చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+