కమలా పసంద్ యజమాని కోడలు ఆత్మహత్య: సూసైడ్ నోట్‌లో ఏముంది?
ప్రముఖ పాన్ మసాలా కంపెనీలైన కమలా పసంద్, రాజ్‌శ్రీ పాన్ మసాలా యజమాని కమల్ కిషోర్ కోడలు దీప్తి చౌరాసియా ఢిల్లీలోని వసంత విహార్‌లోని తన నివాసంలో మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీప్తి చౌరాసియా కమలా పసంద్ యజమాని కమల్ కిషోర్ కుమారుడు అంకిత్ చౌరాసియా భార్య. వారు ఢిల్లీలోని వసంత విహార్ ప్రాంతంలోని నివాసంలో నివసిస్తున్నారు. మంగళవారం సాయంత్రం దీప్తి చౌరాసియా మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వసంత విహార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సూసైడ్ నోట్‌లో ఏముంది?
పోలీసులకు ఘటనాస్థతిలో సూసైడ్ నోట్ లభించింది. ఈ నోట్‌లో ఆమె ఎవరిపైనా ప్రత్యక్షంగా ఆరోపణలు చేయలేదు. అయితే అందులో రాసిన విషయం ఆమె మానసిక స్థితిని ప్రతిబింబిస్తుంది. "ఒక బంధంలో ప్రేమ, విశ్వాసం లేనప్పుడు ఆ బంధంలో కొనసాగడానికి, జీవించడానికి కారణం ఏమిటి?" అని రాసి ఉంది. సూసైడ్ నోట్‌లో మృతురాలు ఎవరినీ నిందించకపోయినా.. మరణించిన దీప్తి చౌరాసియా తల్లిదండ్రులు/బంధువులు మాత్రం అత్తింటి వారిపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీప్తిని ఆత్మహత్యకు పురికొల్పారని వారు ఆరోపిస్తున్నారు.

వైవాహిక జీవితంలోని సమస్యలు
దీప్తి, కమల్ కిషోర్ కుమారుడు అంకిత్ చౌరాసియా వివాహం 2010 సంవత్సరంలో జరిగింది. అంకిత్ చౌరాసియాకు రెండు వివాహాలు జరిగాయని, ఆయన రెండో భార్య దక్షిణ భారత సినిమాలలో నటి అని సమాచారం. వైవాహిక జీవితంలో నెలకొన్న ఈ సమస్యలే దీప్తి ఆత్మహత్యకు దారితీసి ఉండవచ్చని తెలుస్తోంది. వసంత విహార్ పోలీసులు ప్రస్తుతం అన్ని కోణాల్లో కేసును విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications