వినోద్ కాంబ్లీ భార్యను అతను తాకరాని చోట తాకాడు
Recommended Video

ప్రముఖ క్రికెటర్ వినోద్ కాంబ్లీ దంపతులు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అంకుర్ తివారీల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న ఘటన ముంబైలో జరిగింది. వారు ఓ షాపింగ్ మాల్‌లో ఉండగా అంకుర్ తండ్రి వినోద్ కాంబ్లీ భార్య ఆండ్రియాతో అసభ్యకరంగా ప్రవర్తించాడని వారు ఆరోపించారు. దీంతీ ఆగ్రహానికి గురైన కాంబ్లీ దంపతులు తివారీ తండ్రిని చితకబాదారు.
"నేను ఆండ్రియా గేమ్ జోన్‌లో ఉండగా వయసులో పెద్దగా ఉన్న మనిషి నాభార్యను కావాలనే తాకాడు. మరోసారి తాకేందుకు ప్రయత్నించగా ఆండ్రియా ఆయన చేతిని పట్టుకుంది. దీంతో ఆయన ఆండ్రియాను తోసేశాడు. ఆ తర్వాత ఫుడ్ కోర్టులో ఉండగా ఆ మనిషి కొడుకులు ఇద్దరు నా భార్యపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. గొడవ వద్దు అని వారితో చెప్పగా... మేమెవరమో మా సంగతేంటో నీకు తెలియదు"అని బెదిరించినట్లు కాంబ్లీ తెలిపాడు.

మరోవైపు తన చేతిని ఆ పెద్ద వ్యక్తి కావాలనే తాకాడని చెప్పిన ఆండ్రియా... మాల్‌లో జనం ఎక్కువమంది ఉండటంతో ఎవరూ ఏమనుకోరులే అనే ధీమాతో తనను పదేపదే తాకరాని చోట తాకేందుకు ప్రయత్నించాడని వెల్లడించింది. అయితే ఆ మనిషి తాకే సమయంలో గట్టిగా ఆయన చేతిని పట్టుకున్నట్లు చెప్పింది.
తనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో ఆ మనిషి హిందీలో ఏదో చెప్పేసి అక్కడి నుంచి పారిపోయినట్లు ఆండ్రియా వివరించారు. మహిళలను ఎక్కడపడితే అక్కడ ముట్టుకుని కొందరు శునకానందం పొందే రోజులు పోయాయని ఇప్పుడు దొరికితే దీన్ని చాలా కఠినంగా పరిగణించాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆండ్రియా చెప్పారు.
అయితే జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications