కసిగా 15 కత్తిపోట్లు...! ముఖంపై కాల్పులు...! కమలేశ్ తివారి డెత్ రిపోర్ట్
లఖ్‌నవూలోని హిందూత్వ సంస్థ నాయకుడు కమలేశ్ తివారీ హత్య అంత్యంత దారుణంగా జరిగింది. ఆయన్ను ప్లాన్ చేసి, అంత్యంత కసిగా హత్యచేసినట్టు పోస్టు మార్టం చూస్తే అర్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన చాతి భాగం నుండి మెడ ప్రాంతం వరకే 15 కత్తిపోట్లు పోడిచారు. అనంతరం గోంతును కోశారు. ఇది చాలదన్నట్టు ముఖంపై తుపాకితో కాల్చారు.
హిందుత్వ సంస్థకు చెందిన 43ఏళ్ల కమలేశ్ తివారీ లఖ్‌నవులోని తన ఇంట్లో గత శుక్రవారం హత్యకు గురైయిన విషయం తెలిసిందే. కొంతమంది దుండగులు ఆయనపై దాడి చేసి కత్తులతో దారుణంగా పోడిచారు. కమలేశ్ హత్యకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్టు బయటకు వచ్చింది. నివేదిక ప్రకారం ఆయన్ను పకడ్బంది ప్రణాళికతోనే హత్య చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కమలేశ్ చాతి ప్రాంతం నుండి గొంతు భాగం వరకే పదిహేను సార్లు కత్తి పోట్లు ఉన్నట్టు వైద్యులు ఇచ్చిన పోస్టు మార్టం నివేదికలో పేర్కోన్నారు. అనంతరం గోంతుపై విచక్షణరహితంగా గాట్లు పెట్టి కోశారు. అయినా... ఆయన ప్రాణాలతో ఉండడంతో ముఖానికి గురిపెట్టి గన్నుతో కాల్చారు. దీంతో ఆయన కపాలంలోని ఓ బుల్లెట్‌ను వైద్యులు కనుగొన్నారు.

కాగా కమలేశ్ హత్య అనంతరం నిందితులను 24 గంటలలోపే యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఆయన ఇతర మతానికి చెందిన గురువుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని అందుకే ఆయన్ను హత్యచేశారని పోలీసులు తెలిపారు. కాగా 2015లో కమలేశ్ తివారి ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయన్ను హత్య చేసినవారికి కొటిన్నర రూపాయలు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఆయన అంత్యంత పాశవికంగా హత్యకు గురయ్యారు. కమలేశ్ తివారి హత్య కేసులో మొత్తం అయిదుగురు నిందితులను గుర్తించగా ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications