Kangana: క్వీన్ కు షాక్, నిన్న ట్విట్టర్, నేడు ఫ్యాషన్ డిజనర్స్ బ్యాన్, రేపు ?, కోన్ కిస్కా గొట్టం గాళ్లు?
బెంగళూరు: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు గ్రహాలు మొత్తం రివర్స్ లో అనుకూలిస్తున్నాయని సినీ అభిమానులు, కొన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఆమె అభిమానులు అంటున్నారు. ఇప్పటికే క్వీన్ కంగనా రనౌత్ ట్విట్టర్ అకౌంట్ ను శాస్వతంగా బ్లాక్ చెయ్యడంతో కంగనా రనౌత్ అభిమానులు షాక్ తిన్నారు. ట్విట్టర్ లో కంగనాకు 30 లక్షల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇదే సమయంలో ట్విట్టర్ దెబ్బతో షాక్ తిన్న కంగనా రనౌత్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. బాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు ఆనంద్ భూషణ్, రిమ్ జిమ్ దాదు ఇక ముందు మేము కంగనాతో కలిసి పని చెయ్యమని, ఆమెను బ్లాక్ లిస్టులో పెడుతున్నామని బహిరంగంగా ప్రకటించారు. ఎవడో కోన్ కిస్కా గొట్టంగాళ్లు మాతో ఏంది పని చేసేది, వాళ్లు ఎవరో కూడా మాకు తెలీదు, మా సోదరి కంగనా పేరు అడ్డం పెట్టుకుని ఫ్రీపబ్లిసిటీ కోసం పాకులాడుతున్న ఆ ఫ్యాషన్ డిజైనర్లు మాకు చెడ్డపేరు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని, వారిని కోర్టుకు లాగి వారి మీద మేము పరువు నష్టం దావా వేస్తామని కంగనా రనౌత్ సోదరి రంగోళి మండిపడుతున్నారు.

ఇలాంటి వాళ్లతో పని చెయ్యలేము
ద్వేషాలతో ప్రజలను రెచ్చగొట్టే వాళ్లతో కలిసి మేము పని చెయ్యలేము, మంచితనంతో అందరికి మంచి చెయ్యాలని ఆలోచన ఉండేవాళ్లతోనే మేము కలిసి పని చేస్తామని, వాళ్లు ఎవరైనా సరే మాకు అభ్యంతరం లేదని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఆనంద్ భూషణ్, రిమ్ జిమ్ దాదు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

శపథం చేస్తున్నాము
ఇప్పటి వరకు మేము కంగనా రనౌత్ తో కలిసి పని చేసిన సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు, ఆల్ బమ్స్ మొత్తం మా వెబ్ సైట్లలో, సోషల్ మీడియాలో డిలీట్ చేస్తున్నామని ఫ్యాషన్ డిజైనర్ ఆనంద్ భూషణ్ అన్నారు. భవిష్యత్తులో ఇక ముందు కంగనా రనౌత్ తో కలిసి మేము ఏ కొత్త ప్రాజెక్టు కూడా చేపట్టమని, ఆమెతో కలిసి పని చెయ్యమని దేవుడి మీద ప్రమాణం చేస్తున్నామని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఆనంద్ భూషణ్ సోషల్ మీడియాలో స్పష్టం చేశారు.

మంచి పని చేస్తే అడ్డుకుంటారా ?
ఎవరైనా మంచిపని చేస్తే వారిని ప్రోత్సహించాలని, అవరసమైతే సహాయం చెయ్యాలని, అంతేకాని వారిని అడ్డుకుని వారు చేస్తున్న పనులను చెడగొట్టకూడదని ఫ్యాషన్ డిజైనర్ ఆనంద్ భూషణ్ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మీద మండిపడ్డారు. మంచి పని చేసేవాళ్లతో కలిసి పని చెయ్యడానికి మేము ఎప్పుడూ సిద్దంగా ఉంటామని, అయితే ఇక ముందు కంగనా రనౌత్ తో కలిసి పని చెయ్యమని ఫ్యాషన్ డిజైనర్ ఆనంద్ భూషణ్ తేల్చి చెప్పారు.

కోన్ కిస్కా గొట్టంగాళ్లు ?, ఎవరు వాళ్లు
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఆనంద్ భూషణ్ చేసిన వ్యాఖ్యలతో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి, పైర్ బ్రాండ్ రంగోళి స్పంధించారు. అసలు ఆనంద్ భూషణ్ అనే వ్యక్తి ఎవరు ?, ఆ కోన్ కిస్కా గొట్టంగాడు ఎవడు అనే రైంజ్ లో మాట్లాడారు. బాలీవుడ్ లో స్టార్ హోదాలో ఉన్న తన సోదరి కంగనా రనౌత్ పేరును వాడుకుని ఫ్యాషన్ డిజైనర్ గా మరన్ని చాన్స్ లు సంపాధించుకోవాలని, ఆయన కంపెనీకి మైలేజ్ సంపాధించుకోవడానికి ఆనంద్ భూషణ్ ప్రయత్నిస్తున్నాడని రంగోళి ఆరోపించారు.

ఉంటే ఎంత ? ఊడిపోతే ఎంత
మేము వేసుకునే దుస్తుల కోసం మేము బ్రాండ్ లను ఆశ్రయించమని, మాకు నచ్చితేనే ఏదైనా డ్రెస్ లు వేసుకుంటామని నా సోదరి కంగనాకు, నాకు ఇది అలవాటే అని రంగోళి అన్నారు. ఫ్యాషన్ డిజైనర్ ఆనంద్ భూషణ్ మాతో కలిసి పని చేస్తే ఎంత ?, చెయ్యకపోతే ఎంత? అని రంగోళి ఘాటుగా మండిపడ్డారు.
Recommended Video

కోర్టుకు లాగి ముక్కుపిండేస్తాము
మా సోదరి కంగనాకు దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ ను ఫ్రీపబ్లిసిటీగా వాడుకుని మాకు చెడ్డపేరు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న ఫ్యాషన్ డిజైనర్ ఆనంద్ భూషణ్ రిమ్ జిమ్ దాదును చిన్నగా వదిలిపెట్టమని, వాళ్లను కోర్టుకు లాగి పరువు నష్టం దావా వేస్తామని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోళి హెచ్చరించారు. మొత్తం మీద నిన్ని కంగనాకు ట్విట్టర్ షాక్ ఇస్తే ఇప్పుడు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ షాక్ ఇచ్చారు. క్వీన్ కంగనా రనౌత్ కు రేపు ఎవరు షాక్ ఇస్తారో ? అనే విషయం వేచి చూడలని ఆమెకు గిట్టనివాళ్లు అంటున్నారు.
-
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications