Kangana: క్వీన్ కంగనాకు కోవిడ్ పాజిటివ్, ఇంట్లో క్వారంటైన్ లో హ్యాపీగా ఉన్నా, మీరు సేఫ్ గా !
ముంబాయి/ చెన్నై: బాలీవుడ్ క్వీన్, బహుబాష నటి, క్వీన్ కంగనా రనౌత్ కు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. నాకు కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది, ముంబాయిలోని తన సొంత ఇంటిలో హౌమ్ క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నాను, తాను త్వరగా కొలుకోవాలని కోరుకుంటున్న తన సన్నిహితులు, అభిమానులకు చాలా థ్యాక్స్, త్వరలో మళ్లీ మీ ముందుకు వస్తాను, హరహర మహాదేవ్ అంటూ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఆమె స్వయంగా అభిమానులకు కోవిడ్ వచ్చిన విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఇటీవల కంగనా మేడమ్ ట్విట్టర్ ఖాతాను శాస్వతంగా బ్యాన్ చెయ్యడంతో ఇప్పుడు క్వీన్ ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులకు టచ్ లో ఉంటున్నది.

ఆ ఇంటికి వెళ్లాలని కోవిడ్ పరీక్ష
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు హిమాచల్ ప్రదేశ్ లో ఓ విలాసవంతమై బంగ్లా ఉన్న విషయం తెలిసిందే. కోట్ల రూపాయలు ఖర్చు చేసి హిమాలయ పర్వతాల అంచుల్లో కంగనా రనౌత్ ఓ అందమైన ఓ బంగ్లాను నిర్మించుకునింది. హిమాచల్ ప్రదేశ్ లోని ఇంటికి వెళ్లడానికి ముందు కంగనా రనౌత్ ముంబాయిలో కోవిడ్ పరీక్షలు చేసుకోవడంతో ఆమెకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది.

నాబాడీలో పార్టీ చేసుకుంటున్న కరోనా
తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని స్వయంగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఆమె ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో క్లారిటీ ఇచ్చారు. నాబాడీలోకి కరోనా వైరస్ వెళ్లి పార్టీ చేసుకుని ఎంజాయ్ చేస్తోందనే విషయం నాకు తెలిసిపోయింది. నా బాడీలో ఉన్న కరోనా వైరస్ ను అతి త్వరలో నేనే నాశనం చేస్తాను అంటూ కంగనా రనౌత్ ఆమె స్టైల్లో సోషల్ మీడియాలో సమాచారం ఇచ్చింది.

మీరు కూడా ఇలానే చెయ్యండి
ప్రజలారా, మీ మీద దుష్టశక్తులు వాటి ప్రభావం చూపించాలని చూస్తే మీరు కామ్ గా ఉండకూడదు. ఇలాంటి శక్తులకు (వైరస్) మీరు భయపడితే మిమ్మల్ని అది మరింత భయపెట్టే అవకాశం ఉంది, మీరు వైరస్ తో ధైర్యంగా పోరాటం చెయ్యండి ,అదే తోకముడుచుకుని వెళ్లిపోతుందని క్వీన్ కంగనా చెప్పింది.

హరహర మహాదేవ్
కరోనా వైరస్ మామూలుగా వచ్చిపోయే జ్వరం లాంటిదే, మనం దాని మీద పోరాటం చేస్తే అదే పారిపోతుంది అంటూ క్వీన్ కంగనా ఆమె అభిమానులకు ఓ ఉచిత సలహా ఇచ్చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో ప్రజలకు ధైర్యం చెప్పిన నటి కంగనా చివరిలో హరహర మాహాదేవ్ అంటూ ఆమె చెప్పాలని అనుకున్న మాటలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇటీవల బాలీవుడ్ స్టార్స్ సోనూసూద్, అక్షయ్ కుమార్, ఆలియా భట్, కార్తీక్ ఆర్యన్, రణబీర్ కపూర్ తదితరులు కోవిడ్ పాజిటివ్ తో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications