Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kangana:హైకోర్టును ఆశ్రయించిన కంగనా సిస్టర్స్, మూడుసార్లు సమన్లు, డోంట్ కేర్,అరెస్టు భయంతో, వామ్మో!

ముంబాయి/ న్యూఢిల్లీ/ బెంగళూరు: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, క్వీన్ కంగనా రనౌత్, ముంబాయి పోలీసుల సీతలసమరం ఇప్పట్లో ముగిసేటట్లు కనపడటం లేదు. మూడుసార్లు సమన్లు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ముంబాయి పోలీసులు సూచించినా క్వీన్ కంగనా, ఆమె సోదరి రంగోళి డోంట్ కేర్ అంటున్నారు. అయితే ఇదే సమయంలో ఎక్కడ పోలీసులు అరెస్టు చెయ్యడానికి ప్రయత్నిస్తారో అనే భయంతో బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు.

ముంబాయి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చెయ్యాలని కంగనా సిస్టర్స్ హైకోర్టుకు మనవి చేశారు. సినిమా షూటింగ్ లుకు వెళ్లడానికి టైమ్ ఉంటుంది, మా ముందు హాజరుకావడానికి మీకు టైమ్ లేదా ? అంటూ ముంబాయి పోలీసు అధికారులు కంగనా సిస్టర్స్ మీద మండిపడుతున్నారు.

కంగనా సిస్టర్స్ కథ ఏమిటంటే?

కంగనా సిస్టర్స్ కథ ఏమిటంటే?

ముంబాయికి చెందిన ప్రముఖ న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళిపై గత నెల చివరి వారంలో ముంబాయిలో కేసు పెట్టారు. మతపరమైన ఆరోపణలు చేస్తున్నారని, మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి ప్రజలను రెచ్చగొడుతున్నారని న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు.

మతపరమైన ఆరోపణలు చేస్తారా!

మతపరమైన ఆరోపణలు చేస్తారా!

బాలీవుడ్ నటి క్వీన్ కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి మతపరమైన ఆరోపణలు చేస్తున్నారని, మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా ప్రవర్తిస్తున్నారని న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ కోర్టులో ఆరోపించారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి ప్రజలను రెచ్చగొడుతున్నారని, అక్కాచెల్లెలు ఇద్దరూ రెచ్చిపోయి క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టులో మనవి చేశారు.

పోలీసులపై ఆరోపణలు

పోలీసులపై ఆరోపణలు

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోళి ఇటీవల చేసిన ట్విట్ లను న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ కోర్టు ముందు సమర్పించారు. ముంబాయి పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ కోర్టులో ఫిర్యాదు చేశారు.

కంగనా సిస్టర్స్ కు పొలిటికల్ సపోర్ట్

కంగనా సిస్టర్స్ కు పొలిటికల్ సపోర్ట్

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కు బాలీవుడ్ చిత్రపరిశ్రమలో మంచి పలుకుబడి ఉందని, సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న తరువాత రాజకీయ నాయకులతో ఆమెకు ఎక్కువ పరిచయాలు అయ్యాయని, తాను ఏమి చేసినా ఏమీ కాదు ? అనే ధైర్యంతో రెచ్చిపోతుందని న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ ఆరోపించారు. రాజకీయ పలుకుబడి అడ్డంపెట్టుకుని ఇటీవల కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని, దేశద్రోహానికి పాల్పడుతున్నారని న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ కోర్టులో చెప్పారు.

కోర్టు ఆదేశాలతో పోలీసులు ఎంట్రీ

కోర్టు ఆదేశాలతో పోలీసులు ఎంట్రీ

న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ ఆరోపణలపై వివరాలు తెలుసుకున్న మెజిస్ట్రేట్ న్యాయస్థానం న్యాయమూర్తి బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళిపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేసి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ముంబాయి పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన ముంబాయి పోలీసులు కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళిపై విచారణ చేపట్టారు.

మూడుసార్లు డోంట్ కేర్

మూడుసార్లు డోంట్ కేర్

బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళిపై కేసు నమోదు చేసిన ముంబాయి పోలీసులు విచారణకు హాజరుకావాలని ఈనెల మొదటి వారంలోనే ఇద్దరికి సమన్లు జారీ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు సమన్లు జారీ చేసినా కంగనా రనౌత్ కాని, ఆమె సోదరి రంగోళి కాని ఇంతవరకు ముంబాయి పోలీసుల ముందు హాజరుకాలేదు. మరో వైపు నటి కంగనా జయలలిత బయోపిక్ సినిమా షూటింగ్ కు హాజరౌతున్నారని తెలుసుకున్న ముంబాయి పోలీసులకు ఎక్కడో మండిపోయింది.

Recommended Video

    Kangana Ranaut Comments On Urmila Matondkar ఊర్మిళా మతోండ్కర్‌ను అలా అభివర్ణించిన కంగనా !
    హైకోర్టుకు కంగనా సిస్టర్స్

    హైకోర్టుకు కంగనా సిస్టర్స్

    ముంబాయి పోలీసులు తమ మీద కేసు నమోదు చేసి విచారణకు హాజరుకావాలని బెదిరిస్తున్నారని, మేము ఏ తప్పు చెయ్యలేదని, మా మీద నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చెయ్యాలని కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తమ మీద విచారణ చెయ్యాలని బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చెయ్యాలని కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి బాంబే హైకోర్టుకు మనవి చేశారు. మూడుసార్లు సమన్లు జారీ చేసిన ముంబాయి పోలీసులు ఎక్కడ తమను అరెస్టు చేస్తారో ? అనే భయంతో కంగనా సిస్టర్స్ హైకోర్టును ఆశ్రయించారని సమాచారం.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+