కన్నయ్యకు సీరియస్.. ఆసుపత్రిలో చేరిక..
వర్సిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జే.ఎన్.యూ సంఘం నేత కన్నయ్య కుమార్ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. క్రమశిక్షణ చర్యల విషయంలో యూనివర్సిటీ కమిటీ నిర్షయాలను తప్పుబడుతూ ఏప్రిల్ 28 నుంచి కన్నయ్య దీక్ష చేస్తున్నారు. కన్నయ్యతో పాటు మరో 19 విద్యార్థులు కూడా నిరాహాద దీక్ష చేస్తున్నారు. కాగా.. దీక్ష చేపట్టి వారం రోజులు గడిచిపోయినా.. వర్సిటీ అధికారులు మాత్రం విద్యార్థుల దీక్షపై స్పందించలేదు.

ఈ నేపథ్యంలోనే.. గురువారం దీక్షను కొనసాగించిన కన్నయ్య వాంతులు చేసుకున్నాడు. దీంతో కన్నయ్యను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు విద్యార్థులు. వారం రోజులుగా దీక్ష చేస్తున్నందున కన్నయ్య ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కన్నయ్య ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్టుగా సమాచారం.












Click it and Unblock the Notifications