రాజకీయాల్లోకి కన్నయ్య కుమార్ ఎంట్రీ: లోక్ సభకు పోటీ: పిలిచి టికెట్ ఇచ్చారు!
పాట్నా: కన్నయ్యకుమార్ గుర్తున్నాడా? ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ విద్యార్థి నాయకుడు రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతంలో పోరాడిన కన్నయ్య కుమార్.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోతున్నారు. బిహార్ లోని బేగుసరాయ్ లోక్ సభ స్థానం నుంచి ఆయన ఎన్నికల బరిలో నిల్చోనున్నారు. సీపీఐ ఆయనకు పిలిచి మరీ టికెట్ ఇచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ బిహార్ రాష్ట్ర శాఖ నాయకులు ఓ ప్రకటన విడుదల చేశారు.
నిజానికి కన్నయ్య కుమార్ కు టికెట్ ఇవ్వాలని 21 రాజకీయ పార్టీల మహా కూటమి నిర్ణయించుకుంది. సీటు విషయంలో తకరారు ఏర్పడింది. బేగుసరాయ్ స్థానమే తనకు కావాలంటూ కన్నయ్య కుమార్ పట్టుబట్టగా.. మహాకూటమి ఇందులో నిరాకరించింది. మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న రాష్ట్రీయ జనతా దళ్ నేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ ఇక్కడి నుంచి పోటీలో ఉండటమే దీనికి కారణం.

తేజస్వీని దృష్టిలో పెట్టుకుని, మహా కూటమి నాయకులు కన్నయ్యకుమార్ కు బేగుసరాయ్ స్థానాన్ని ఇవ్వడానికి ససేమిరా అన్నాయి. దీనితో- కన్నయ్య వెనక్కి తగ్గాడు. అదే సమయంలో సీపీఐ సీన్ లోకి వచ్చింది. బేగుసరాయ్ టికెట్ ఇవ్వడానికి తమకేమీ అభ్యంతరం లేదంటూ సంకేతాలు పంపించింది. ఫలితంగా- సీపీఐ అభ్యర్థిగా పోటీ చేయడానికి కన్నయ్య కుమార్ అంగీకరించారు.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications