బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమికుల రోజు ప్రభుత్వ సెలవు, ప్రత్యేక ప్యాకేజీ, రెండు గొర్రెలకు పెళ్లి, కాషాయం భయం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14వ తేదీ ప్రభుత్వ సెలవు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వాటల్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వాటల్ నాగరాజ్ బెంగళూరులో ధర్నా చేశారు. ప్రేమికుల రోజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు ప్రకటించాలని, ప్రేమికులకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వరైటీగా ధర్నా చేసిన వాటల్ నాగరాజ్ భాజాబజంత్రీల నడుమ రెండు గొర్రెలకు పెళ్లి చేసి అందర్నీ ఆకర్షించారు.

ప్రేమికుల దినోత్సవంకు వ్యతిరేకం

ప్రేమికుల దినోత్సవంకు వ్యతిరేకం

ఉత్తర కర్ణాటకలో ప్రేమికుల రోజును పలు హిందూ సంఘ, సంస్థలు కొన్ని సంవత్సరాలుగా అడ్డుకుంటున్నాయి. ప్రేమికులు పార్కులు, రోడ్ల మీద కనపడితే అక్కడే పెళ్లి చేసిన సందర్బాలు ఉన్నాయి. ప్రేమికుల రోజు జరుపుకోవడం భారతదేశ సాంప్రధాయలకు వ్యతిరేకం అంటున్నారు.

ప్రేమ రథం

ప్రేమ రథం

ప్రేమికుల దినోత్సవం సందర్బంగా బుధవారం బెంగళూరులో ప్రేమికులకు వాటల్ నాగరాజ్ మద్దతు ప్రకటించారు. గత సంవత్సరం ప్రేమికుల దినోత్సవం రోజు ప్రేమ రథం ఎక్కిన వాటల్ నాగరాజ్ బెంగళూరు నగరంలో సంచరించి రోడ్ల మీద రోజాపూలు చల్లి ప్రేమికులకు మద్దతు ప్రకటించారు.

 లవర్స్ కు ప్రత్యేక ప్యాకేజీ

లవర్స్ కు ప్రత్యేక ప్యాకేజీ

ప్రేమికులకు రక్షణ కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలని వాటల్ నాగరాజ్ మనవి చేశారు. ప్రేమికులను ప్రోత్సహించాలని, ప్రేమ వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష సహాయం చెయ్యాలని, ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని వాటల్ నాగరాజ్ డిమాండ్ చేశారు.

చిత్రవిచిత్రంగా !

చిత్రవిచిత్రంగా !

వాటల్ నాగరాజ్ ఏదో ఒక విషయంలో ప్రతినిత్యం ధర్నాలు చేస్తూనే ఉంటారు. అయితే ఆయన చేసే ధర్నాలకు ఒకదానికి ఒకటి పోలిక ఉండదు. చిత్ర విచిత్రంగా ఎవ్వరూ చెయ్యని విధంగా మెజస్టిక్ బస్ స్టాండ్ లో రోడ్డు మీద చాపా, దిండు వేసుకుని అడ్డంగా నిద్రపోవడం, ప్రజలకు ఉచితంగా ఉప్పు, కోడిగుడ్లు, ఉల్లిపాయలు పంచిపెట్టడం లాంటి ధర్నాలు చేస్తుంటారు.

రెండు గొర్రెలకు పెళ్లి

రెండు గొర్రెలకు పెళ్లి

ప్రేమికుల రోజు సందర్బంగా వారికి మద్దతు తెలుపుతూ బుధవారం బెంగళూరులో వాటల్ నాగరాజ్ భాజాబజంత్రీల మధ్య హిందూ సాంప్రధాయం ప్రకారం రెండు గొర్రెల మెడలో పూలమాలలు వేసి పెళ్లి చేశారు. ప్రేమికులకు ఎప్పుడూ తన మద్దతు ఉంటుందని వాటల్ నాగరాజ్ భరోసా ఇచ్చారు.

కాషాయం భయంతో !

కాషాయం భయంతో !

హిందూ సంఘ, సంస్థలు ఎక్కడ దాడి చేస్తాయో, ఎక్కడ పెళ్లి చేస్తారో అనే ఆందోళనతో భయం భయంగా తిరుగుతున్న ప్రేమికులకు వాటల్ నాగరాజ్ మద్దతు ఇవ్వడంతో కొంచెం ధైర్యం వచ్చింది. ఇప్పుడు ప్రేమికుల రోజున ప్రభుత్వ సెలవు ప్రకటించాలని, ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని వాటల్ నాగరాజ్ డిమాండ్ చెయ్యడంతో ప్రేమికులు సంబరపడిపోతున్నారు.

English summary
Kannada Activist Vatal Nagaraj demands central and state government to delclare holiday on Valentines day. He also demand governments to give rs.50000 to 1 lakh to to any couple who marry for love.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X