Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హీరో ఉపేంద్ర కొత్త పార్టీ, డేట్ ఫిక్, ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్, యుపీపీ, జెండా, సిద్దాంతాలు!

బెంగళూరు: దర్శకుడు, బహుబాష నటుడు ఉపేంద్ర కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించడానికి ముహుర్తం నిర్ణయించారు. ఈనెల 18వ తేదీ మంగళవారం తన కొత్త రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని హీరో ఉపేంద్ర ఆదివారం స్పష్టం చేశారు. ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలని ఉపేంద్ర నిర్ణయించారు.

ప్రజలే ప్రభువులు, ప్రజలకు నీతివంతమైన పరిపాలన అందించడానికి మనం కేంద్ర బిందువు కావాలని, ఈ వ్యవస్థను మార్చడానికి ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యుపీపీ) పార్టీని ఈనెల 18వ తేదీన ఉదయం 10.30 గంటలకు తన నివాసంలో ప్రారంభిస్తానని, మీరందరూ హాజరుకావాలని ఆదివారం సోషల్ మీడియాలో ఉపేంద్ర మనవి చేశారు.

Kannada actor and director Upendra to announce a new party on September 18

హీరో ఉపేంద్ర మే 10వ తేదీన ఢిల్లీలో ఉత్తమ ప్రజాకీయ పార్టీని రిజిస్టర్ చేయించారు. ఇప్పటికే హీరో ఉపేంద్ర తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. అయితే పార్టీ జెండా, సిద్దాంతాలు, వాటి ప్రణాళిక విషయంలో ఇంత కాలం కసరత్తులు చేసిన ఉపేంద్ర ఆ వివరాలు మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 18వ తేదీ హీరో ఉపేంద్ర పుట్టిన రోజు. ఆ రోజు తన అభిమాన నటుడు ఉపేంద్రకు శుభాకాంక్షలు చెప్పడానికి భారీ ఎత్తున అభిమానులు ఆయన ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. అదే సందర్బంలో హీరో ఉపేంద్ర ఉత్తమ ప్రజాకీయ పార్టీ గుర్తును ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది.

Kannada actor and director Upendra to announce a new party on September 18

2018 కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా హీరో ఉపేంద్ర కేపీజేపీ పార్టీని స్థాపించారు. శాసన సభ ఎన్నికల తేదీని ప్రకటించిన తరువాత కేపీజేపీలో భిన్నాభిప్రాయాలు తలెత్తడంతో హీరో ఉపేంద్ర ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ స్థాపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+